GURTIMPU: యథార్థ సంఘటనలతో.. స్పోర్ట్స్, కోర్ట్ రూం డ్రామా

ABN , Publish Date - May 24 , 2025 | 08:24 AM

కేజేఆర్ హీరోగా తెన్‌పతియాన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న చిత్రం గుర్తింపు.

GURTIMPU

కేజేఆర్ (KJR ) హీరోగా తెన్‌పతియాన్ (THENPATHIYAN) దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న చిత్రం ‘గుర్తింపు’ (GURTIMPU). స్పోర్ట్స్, కోర్ట్ డ్రామాగా, యథార్థ సంఘటనల ఆధారంగా తెర‌కెక్కుతోన్న‌ ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్‌ను శుక్ర‌వారం రిలీజ్ చేశారు. గ‌తంలో అశ్విన్ బాబు ‘శివం భజే’ చిత్రాన్ని నిర్మించిన‌, శివ కార్తికేయన్ ‘వరుణ్ డాక్టర్‘ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసిన గంగా ఎంటర్టైన్మెంట్స్ (Ganga Entertainments) ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత మహేశ్వర్ రెడ్డి మూలి మాట్లాడుతూ.. పేదరికంలో ఉన్న ఓ వ్యక్తి.. తన కలల్ని నెరవేర్చుకునేందుకు క్రీడా రంగంలో ఎదిగిన తీరు, క్రీడా రంగంలో గుర్తింపు కోసం పడిన శ్రమ, చేసిన ప్రయాణం, ఎదుర్కొన్న సవాళ్లను అందరికీ కనెక్ట్‌ అయ్యేలా ఎమోషనల్ డ్రామాగా ‘గుర్తింపు’ సినిమాను రూపొందిస్తున్నామ‌ని, ఇప్పటికి 85 శాతం షూటింగ్ పూర్తయిందన్నారు.

GrnBN3hXQAE2SpE.jpeg

స్పోర్ట్స్, కోర్ట్ డ్రామాగా రానున్న ఈ ‘గుర్తింపు’ చిత్రంలో కేజేఆర్, సింధూరి విశ్వనాథ్, విజి వెంకటేష్, రంగరాజ్ పాండే, మన్సూర్ అలీ ఖాన్, రమా, మోహన్ రామ్, ఆంటోనీ, అజిత్ ఘోషి, విమల్, ఇజబెల్లా, షాన్, దీపిక, జానకి, అరుల్ జ్యోతి వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తుండ‌గా జిబ్రాన్ (Ghibran Vaibodha) సంగీతం సంగీతం, ప్ర‌ముఖ పీట‌ర్ మెయిన్స్ యాక్ష‌న్ కోరియోగ్ర‌ఫీ చేస్తున్నారు.

Updated Date - May 24 , 2025 | 08:24 AM