Spirit: ప్రభాస్ స్పిరిట్‌లో.. రానా తమ్ముడు అభిరామ్! ఇదసలు ఊహించలే
ABN , Publish Date - Nov 06 , 2025 | 06:14 PM
సెట్స్ పైకి వెళ్లక ముందే ఆ మూవీ తెగ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే క్రేజీ కాంబోతో హైఫీవర్ తెప్పించగా.. ఇప్పుడు కొత్త కొత్త క్యారెక్టర్లు మరింత ఊరిస్తున్నాయి. తాజాగా మరో యాక్టర్ ఈ మూవీలో కనిపించబోతున్నాడన్న న్యూస్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
టాలీవుడ్ మాత్రమే కాదు... ఆలోవర్ ఇండియన్ ఇండస్ట్రీ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ 'స్పిరిట్' (Spirit). రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ సందీప్ వంగా (Sandeep Vanga) కాంబోలో వస్తున్న ఈ మూవీపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఓ వైపు పాన్ ఇండియా సినిమాలతో ఇప్పటికే ప్రభాస్ మోస్ట్ ఫేవరేట్ హీరోగా మారగా.. 'కబీర్ సింగ్' (Kabir Singh), ‘యానిమల్’ (Animal) లాంటి హిట్లతో సందీప్ వంగా స్ట్రాంగ్ గా ఎస్టాబ్లిష్ అయ్యాడు. దీంతో వీరి కాంబోలో మూవీ ఎలా ఉంటుందో అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఈ సినిమాలో గతంలో ఎన్నడూ లేని లుక్ లో ప్రభాస్‌ను సందీప్ వంగా చూపెట్టబోతున్నాడని తెలియడంతో క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. దీనికి తోడు అనేక ఆసక్తికరమైన విషయాలు బయటకు వస్తున్న విషయాలు మరింత హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి.
'స్పిరిట్' ప్రీ ప్రొడక్షన్ ఇప్పటికే పూర్తి కావడంతో ఈ నెల చివరికి షూటింగ్ ను మొదలు పెట్టాలనుకుంటున్నారు. హీరోయిన్ గా త్రిప్తి దిమ్రి (Tripti Dimri) చేస్తుండగా... ప్రకాశ్ రాజ్ (Prakash Raj ), కాంచన (Kanchana) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక విలన్‌గా బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi) నటిస్తున్నాడు. అలాగే కొరియా నుంచి డాన్ లీ (Don Lee ) కూడా దింపుతున్నాడట. దీంతో సెట్స్ పైకి వెళ్లక ముందే గ్లోబల్ టచ్ వచ్చేసిందీ సినిమాకు.
ఇక సందీప్ రెడ్డి వంగా తన సినిమాల్లో యాంటగనిస్ట్ పాత్రకు ఎంత క్రేజ్ ఉంటుందో ఇప్పటికే టేస్ట్ చూపించాడు . అందుకే ‘స్పిరిట్’లో ఎవరు, ఎలా కనిపిస్తారన్న దానిపై భారీ ఆసక్తి నెలకొంది. దీనికి తోడు మరో క్రేజీ న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఓ పెద్ద ప్రొడ్యూసర్ కొడుకు కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడట. దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి దగ్గుబాటి అభిరామ్ (Abhiram) ఒక స్ట్రాంగ్ రోల్ లో ఎంట్రీ ఇస్తాడట. సందీప్ స్వయంగా అభిరామ్‌ను ఎంచుకున్నాడట.
అయితే ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు కానీ న్యూస్ మాత్రం వైరల్ గా మారింది. ఇది కనుక నిజమైతే అభిరామ్ కెరీర్‌కు ఇది బిగ్ బ్రేక్ అవుతుందని అంతా అనుకుంటున్నారు. ఎందుకంటే తేజ దర్శకత్వంలో 'అహింస' సినిమాలో అభిరామ్ హీరోగా నటించాడు కానీ అది పరాజయం పాలైంది. దాంతో ఈ సినిమాతో అభిరామ్ ట్రాక్ లో పడతాడని అనుకుంటున్నారు. ఎందుకంటే ప్రభాస్, సందీప్ కాంబినేషన్ అంటే దేశమంతా క్రేజ్. ఇలాంటి ప్రాజెక్టులో చోటు దొరకడం అరుదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Read Also : Sreeleela: వరంగల్‌లో.. శ్రీలీల సందడి! కిక్కిరిసిపోయిన స్టేషన్ రోడ్లు
Read Also: Kaantha Trailer: మట్టిని కాదు.. పర్వతాన్ని..