SIIMA 2025: సైమాకు సర్వం సిద్ధం.. ఈసారి ఎక్కడంటే..
ABN , Publish Date - Jul 18 , 2025 | 09:19 PM
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుక ప్రతి ఏటా సక్సెస్ ఫుల్ గా న జరుగుతోంది.
సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా-Sima) వేడుక ప్రతి ఏటా సక్సెస్ ఫుల్ గా న జరుగుతోంది. 2012లో ఈ వేడుకలు మొదలయ్యాయి. 12 ఏళ్లుగా విజయవంతంగా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. దక్షిణాది సినిమాలు, అందులో ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే అవార్డుల వేడుక ఇది. 13 ఎడిసన్ ‘సైమా’ వేడుకకు రంగం సిద్దమయింది.
సెప్టెంబరు 5, 6 తేదీల్లో జరగనున్నాయి. దుబాయ్ వేదిక ఈ వేడుక జరగనుంది. నామినేషన్స్ జాబితాను త్వరలో విడుదల చేయనున్నారు. గత రెండు సంవత్సరాలుగా దుబాయ్‌లోనే వేడుకలు జరిగాయి.