Priya Anand: స్విమ్మింగ్ ఫూల్‌లో.. జలకాలాటలతో కవ్విస్తున్న శర్వానంద్ భామ
ABN, Publish Date - May 08 , 2025 | 02:44 PM
కోలీవుడ్‌లోని యంగ్ హీరోయిన్లలో ప్రియా ఆనంద్ ఒకరు. తెలుగులో రానా లీడర్ సినిమాతో అరంగేట్రం చేసిన ఈ చిన్నది ఆ తర్వాత శర్వానంద్ 'కో అంటే కోటి' వంటి మరో నాలుగైదు సినిమాలు చేసి టాలీవుడ్‌లో కనుమరుగైంది.
కోలీవుడ్‌లోని యంగ్ హీరోయిన్లలో ప్రియాఆనంద్ (Priya Anand) ఒకరు. తెలుగులో రానా లీడర్ సినిమాతో సినిమా అరంగేట్రం చేసిన ఈ చిన్నది ఆ తర్వాత శర్వానంద్ 'కో అంటే కోటి' వంటి మరో నాలుగైదు సినిమాలు చేసి టాలీవుడ్‌లో కనుమరుగైంది. తమిళం, కన్నడలో మాత్రం అడపా దడపా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
ఇటీవల తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘సుమో’ అనే చిత్రంలో హీరో మిర్చి శివ ప్రియురాలి పాత్రలో మురిపించారు. ప్రముఖ నిర్మాత ఐసరి కె. గణేష్ నిర్మించిన ఈ చిత్రంలో జపాన్‌కు చెందిన సుమో వీరుడు యాషినోరి తషిరో కీలక పాత్రను పోషించడం విశశేషం. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అశించిన ఫళితం ఇవ్వకపోవడంతో అమ్మడికి మరోమారు నిరాశే ఎదురైంది.
అయితే సామాజిక మాధ్యమాల్లో నిత్యం యాక్టివ్‌గా ఉండే ప్రియా ఆనంద్ (Priya Anand) తాజాగా ఈత కొలనులో అందాలను ఆరబోస్తూ కనిపించింది. ఈ వీడియోను తన ఇన్‌స్టాఖాతాలో షేర్ చేయగా, అది కాస్తా తెగ వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన ఆమె అభిమానులు.. సో క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తూ, షేర్ చేస్తున్నారు.