Nabha Natesh: ఇదే.. నా జన్మస్థలం! ఊరిని పరిచయం చేసిన హీరోయిన్
ABN , Publish Date - Aug 31 , 2025 | 03:46 PM
సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు షేర్ చేస్తుంటుంది హీరోయిన్ నభా నటేష్
సోషల్ మీడియాలో బిజీగా ఉంటూ తన పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలు షేర్ చేస్తుంటుంది హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh). ఆమె తాజాగా తన సొంత పట్టణం శృంగేరికి వెళ్లింది. అక్కడి ప్రసిద్ధ దేవాలయాలు సందర్శించి, ఆ విశేషాలు ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. తన కుటుంబ సభ్యులతో కలిసి తాను తీసుకున్న ఫొటోస్ ను నభా పోస్ట్ చేసింది. ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ లో
ఈ సందర్భంగా నభా నటేష్ తన పోస్ట్‌లో.. శృంగేరి, నా జన్మస్థలం. రామాయణానికి పూర్వపు పవిత్రమైన చరిత్ర ఈ నగరానికి ఉంది. మహర్షుల తపస్సులచే పవిత్రమైన భూమి ఇది. దశరథుడితో పుత్రకామేష్టి యాగం చేయించిన ఋషి ఋష్యశృంగుడికి కూడా ఈ నగరంతో అనుబంధం ఉంది. త్రేతాయుగానికి అనుసంధానించే గొప్ప చరిత్ర గల నగరమిది. జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు తన మొదటి అమ్నయ పీఠాన్ని స్థాపించడానికి శృంగేరిని ఎంచుకున్నారు. ఆయన జ్ఞాన స్వరూపమైన శారదాంబ దేవతను ప్రతిష్ఠించి, శృంగేరిని అద్వైత వేదాంతానికి ప్రసిద్ధ ప్రాంతంగా మార్చారు.
వేదాలు, కళలకు నాకు పరిచయం చేసింది శృంగేరి. చిన్నతనం నుంచి ఈ పవిత్ర పట్టణం అందించిన చరిత్ర, సంస్కృతి, జ్ఞానం నాకెంతో ప్రేరణ ఇచ్చాయి. పెద్దయ్యాక భారతీయ పురాణాలు, ఆధ్యాత్మిక ఆలోచనల పట్ల నాకున్న ఇష్టం మరింత పెరిగింది. దట్టమైన అడవుల మధ్య ఉండి, భారీ వర్షపాతానికి ప్రసిద్ధి చెందిన శృంగేరి సహనం, అంతర్గత బలాన్ని కలిగిస్తుంది. ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ నా చిన్ననాటి జ్ఞాపకాలు పలకరిస్తూ నిత్యం మార్గదర్శనం చేస్తుంటాయని పేర్కొంది.