సోలో బాయ్ వినోదం
ABN , Publish Date - Jun 20 , 2025 | 04:41 AM
గౌతమ్ కృష్ణ, రమ్య పసుపులేటి జంటగా నటించిన చిత్రం ‘సోలో బాయ్’. శ్వేతా అవస్తి, షఫీ, భద్రం కీలకపాత్రలు పోషించారు. నవీన్‌కుమార్ దర్శకత్వంలో సెవెన్‌హిల్స్ సతీశ్ నిర్మించారు..
గౌతమ్ కృష్ణ, రమ్య పసుపులేటి జంటగా నటించిన చిత్రం ‘సోలో బాయ్’. శ్వేతా అవస్తి, షఫీ, భద్రం కీలకపాత్రలు పోషించారు. నవీన్‌కుమార్ దర్శకత్వంలో సెవెన్‌హిల్స్ సతీశ్ నిర్మించారు. జూలై 4న ఈ చిత్రం విడుదలవుతోంది. ఇటీవలే చిత్రబృందం ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ ‘మధ్య తరగతి నేపథ్యంలో వస్తున్న పూర్తి వినోదాత్మక చిత్రమిది. భావోద్వేగాలతో పాటు వాణిజ్యహంగుల కలబోతగా తెరకెక్కింది. గౌతమ్‌కృష్ణ అద్భుతంగా నటించాడు’ అని చెప్పారు. సెవెన్‌హిల్స్ సతీశ్ మాట్లాడుతూ ‘గౌతమ్‌కృష్ణ ఈ చిత్రానికి పారితోషికం తీసుకోలేదు. నిర్మాణంలోనూ పాలు పంచుకున్నాడు. సినిమా హిట్టయ్యాక పారితోషికం తీసుకుంటానని చెప్పాడు. ఈ సినిమాతో ఆయనకు మంచి విజయం దక్కాలి’ అని కోరుకున్నారు. ఈ చిత్రానికి కంటెంటే హీరో, అన్ని వర్గాలను అలరించే అంశాలతో దర్శకుడు తీర్చిదిద్దాడు అని గౌతమ్‌కృష్ణ తెలిపారు.