Producer Satish: యువతకు స్ఫూర్తినిచ్చే సోలో బాయ్‌

ABN , Publish Date - Jul 04 , 2025 | 05:31 AM

ఇండస్ట్రీలో ఎత్తుపల్లాలు ఉంటాయని తెలిసే వచ్చాను. మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతోనే నిర్మాతగా సినిమాలు చేస్తున్నాను...

‘ఇండస్ట్రీలో ఎత్తుపల్లాలు ఉంటాయని తెలిసే వచ్చాను. మంచి చిత్రాలను ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతోనే నిర్మాతగా సినిమాలు చేస్తున్నాను. తమ కాళ్ల మీద నిలబడాలని తపించే యువతకు స్ఫూర్తినిచ్చేలా మా ‘సోలో బాయ్‌’ చిత్రం ఉంటుంది’ అని నిర్మాత సెవెన్‌హిల్స్‌ సతీశ్‌ అన్నారు. గౌతమ్‌ కృష్ణ, రమ్య పసుపులేటి జంటగా నవీన్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా సెవెన్‌ హిల్స్‌ సతీశ్‌ ‘సోలో బాయ్‌’ విశేషాలను మీడియాతో పంచుకున్నారు.


  • నిర్మాతగా నా గత చిత్రాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని పరిమిత బడ్జెట్‌తో మంచి ఔట్‌పుట్‌ వచ్చేలా ‘సోలో బాయ్‌’ చిత్రాన్ని నిర్మించాం. మధ్యతరగతి కుటుంబాల్లోని యువత జీవితంలో స్థిరపడేందుకు చేసే ప్రయత్నాలు, ఆ క్రమంలో అనుభవించే సంఘర్షణ నేపథ్యంలో హృదయాలకు హత్తుకునేలా దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు.

  • అనుకున్న బడ్జెట్‌ కన్నా తక్కువలోనే ‘సోలో బాయ్‌’ సినిమా పూర్తి చేశాం. మా హీరో గౌతమ్‌కృష్ణ నాకు మంచి స్నేహితుడు. అతనికి ‘బిగ్‌బాస్‌’తో వచ్చిన గుర్తింపు మా సినిమా ప్రచారానికి తోడ్పడుతోంది. నార్నే నితిన్‌తో థ్రిల్లర్‌ జానర్‌లో ఓ చిత్రం చేయబోతున్నాను.

Updated Date - Jul 04 , 2025 | 05:31 AM