సోషియో ఫాంటసీ ప్రేమకథ
ABN , Publish Date - Jun 29 , 2025 | 02:30 AM
సోషియో ఫాంటసీ ప్రేమకథతో రూపుదిద్దుకున్న ‘దీర్ఘాయుష్మాన్ భవ’ చిత్రం జులై 11న విడుదల కానుంది. కార్తీక్‌రాజు, మిస్తీ చక్రవర్తి జంటగా నటించిన ఈ చిత్రానికి...
సోషియో ఫాంటసీ ప్రేమకథతో రూపుదిద్దుకున్న ‘దీర్ఘాయుష్మాన్ భవ’ చిత్రం జులై 11న విడుదల కానుంది. కార్తీక్‌రాజు, మిస్తీ చక్రవర్తి జంటగా నటించిన ఈ చిత్రానికి పూర్ణానంద్ దర్శకుడు. వంకాయలపాటి మురళీకృష్ణ నిర్మించారు. చక్కటి ఫ్యామిలీ కథతో రెండున్నర గంటలపాటు ప్రేక్షకుల్ని అలరించే వినోదంతో సినిమా ఉంటుందని ఆయన చెప్పారు. సోషియో ఫాంటసీ కావడంతో గ్రాఫిక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. ‘మా సినిమాలో సీనియర్ నటి ఆమని నటన ఓ హైలైట్. హీరోహీరోయిన్లు తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ‘జబర్దస్త్’ ఆర్టిస్టుల కామెడీ ఆద్యంతం అలరిస్తుంది’ అని దర్శకుడు పూర్ణానంద్ చెప్పారు.