Breaking: అఖండ2.. ప్రీమియర్స్ రద్దు! షాక్‌లో అభిమానులు
ABN , Publish Date - Dec 04 , 2025 | 06:37 PM
ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాల నడుమ ఈ రాత్రి రెండు తెలుగు రాష్ట్రాలలో పడాల్సిన బాలకృష్ణ అఖండ2 (Akhanda2) ప్రీమియర్స్ రద్దయ్యాయి.
అనుకున్నంత అయింది.. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంచనాల నడుమ ఈ రాత్రి రెండు తెలుగు రాష్ట్రాలలో పడాల్సిన బాలకృష్ణ అఖండ2 (Akhanda2) ప్రీమియర్స్ రద్దయ్యాయి. ఈ మేరకు మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేసి టెక్నికల్ సమస్యల వళ్ల సినిమా ప్రీమియర్స్ వేయలేక పోతున్నామని, సాధ్యమైనంత వరకు చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ మా ప్రయత్నాలు విఫలం అయ్యాయని ప్రకటిస్తూ 14 రీల్స్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. క్షమాపణలు తెలిపింది. రేపు యదావిధిగా సినిమా థియేటర్లలో రిలీజ్ అవుతుందని తెలిపారు.
అయితే.. సినిమా విడుదలకు రెండు రోజుల ముందు నుంచే ఓపెన్ చేయాల్సిన అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అవకపోవడం, చెన్నై కోర్టులో కేసు పడడం ఇత్యాది అంశాలతో చాలామంది సినిమా విడుదల, ప్రీమియర్స్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. తీరా మరో అరగంటలో ప్రీమియర్స్ స్టార్ట్ అవాల్సిన సమయంలో సడన్‌గా నిర్మాతలు ప్రీమియర్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో నందమూరి అభిమానులు షాక్‌లోకి వెళ్లిపోయారు
అసలు ఏం జరుగుతుందిరా.. పెద్ద హీరో సినిమా అంటే ఇవన్నీ ముందే చూసుకోవాలి కదా.. మాలాంటి అభిమానుల మనోభావాలతో ఎందుకు ఆడుకుంటారు అని అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. కనిపిస్తే చంపేసే లెవల్‌లో వారి ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. దానికితోడు సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో జరుగుతున్న యాంటి ఫ్యాన్ ట్రోల్స్ కు ఇప్పుడు ఈ ప్రీమియర్స్ రద్దు అంశం అగ్నికి అజ్వం పోసినట్లైంది. దీంతో సామాజిక మాధ్యమాల్లో రచ్చ అంతకుమించి అనేలా జరుగుతోంది.