SKN Emphasizes: కంటెంట్‌ ఉంటేనే కలెక్షన్లు

ABN , Publish Date - Jul 07 , 2025 | 03:07 AM

‘ప్రస్తుతం సినిమాల్లో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న ఏకైక అంశం మంచి కంటెంట్‌ మాత్రమే. సినిమా చిన్నదైనా, పెద్దదైనా ముందు కథ బావుండాలి. ప్రేక్షకుల అభిరుచి...

‘ప్రస్తుతం సినిమాల్లో ప్రేక్షకుల్ని మెప్పిస్తున్న ఏకైక అంశం మంచి కంటెంట్‌ మాత్రమే. సినిమా చిన్నదైనా, పెద్దదైనా ముందు కథ బావుండాలి. ప్రేక్షకుల అభిరుచి మారింది. ఎంత హంగామా చేసినా సినిమాలో కంటెంట్‌ లేకుంటే థియేటర్లకు రావడం లేదు. మంచి కథతో వచ్చిన సినిమాలే బాక్సాఫీసు దగ్గర నిలబడుతున్నాయి’ అని నిర్మాత ఎస్‌కేఎన్‌ అన్నారు. ఆయన నిర్మిస్తున్న పలు చిత్రాల విశేషాలను ఆదివారం మీడియాతో పంచుకున్నారు.

  • నిర్మాతను అవ్వాలని నేను ఇండస్ట్రీకి రాలేదు. అవకాశం వచ్చింది. అందిపుచ్చుకున్నాను. ఇప్పుడు హిందీలోనూ సినిమాలు చేస్తున్నాను. నిర్మాతగా నెగ్గుకు రావడం అంత సులభం కాదు. మన కష్టం అంతా ఒక్కరోజులో పోవచ్చు. పది రూపాయలు పెడితే ఇరవై రూపాయలు వస్తుందని నిర్మాణ రంగంలోకి అడుగుపెడితే నష్టపోతాం. ముందు ఈ రంగం పట్ల మక్కువ ఉండాలి.

  • ప్రస్తుతం ‘రాజాసాబ్‌’ బ్యాలెన్స్‌ షూట్‌ పూర్తి చేసే పనిలో ఉన్నాం. కిరణ్‌ అబ్బవరంతో ‘చెన్నై లవ్‌స్టోరీ’ చేస్తున్నా. హిందీలో ‘బేబీ’ చిత్ర ం రీమేక్‌ చేస్తున్నాం. ఆగస్టులో చిత్రీకరణ మొదలుపెడతాం. దర్శకుడు మారుతి, సాయిరాజేశ్‌తో కూడా మా బేనర్‌లో సినిమాలు చేస్తున్నాం. ఇద్దరు కొత్త దర్శకులతో సినిమాలు చేయబోతున్నాం.

  • నిర్మాతగా తక్కువ బడ్జెట్‌లో మంచి కథలతో సినిమాలు చేయడం, అవి ప్రేక్షకాధరణ పొందడం నాకు సంతోషాన్నిచ్చింది. ప్రస్తుతం పలు అగ్ర నిర్మాణ సంస్థలతో కలసి సినిమాలు నిర్మిస్తున్నాను. ఇప్పటివరకూ కొందరు తెలుగమ్మాయిలను నా సినిమాల ద్వారా కథానాయికలుగా పరిచయం చేశాను. మరో ముగ్గురు తెలుగమ్మాయిలను పరిచయం చేయబోతున్నా. అలాగే మహిళా దర్శకులతోనూ సినిమాలు చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నా.

Updated Date - Jul 07 , 2025 | 03:07 AM