Akella: ఇద్దరు గేయ రచయితలు ఒకే చోట సరదాగా ..

ABN , Publish Date - Sep 19 , 2025 | 11:20 PM

ప్రముఖ సినీ కథ, మాటల రచయిత ఆకెళ్ళ ఇక లేరు.'మగమహారాజు' చిత్రంతో రచయితగా పరిచయం అయిన ఆయన  గురువారం రాత్రి అనారోగ్యంతో కన్నుమూశారు.

సినీ కథ, మాటల రచయిత ఆకెళ్ళ (Akella) ఇక లేరు. గురువారం రాత్రి అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు. అగ్రదర్శకుల చిత్రాలకు ఆయన కథ, మాటలు అందించారు. నరేశ్‌ హీరోగా నటించిన అయ్యయ్యో బ్రహ్మయ్య సినిమాకు దర్శకత్వం వహించారు. గీత రచయిత సీతారామశాస్త్రికి (Sirivennela seetharama sastry) స్నేహితుడైన ఆకెళ్ళ... విశ్వనాథ్‌ కు ఆయన్ని పరిచయం చేసి 'సిరివెన్నెల'కు పాటలు రాసేలా చేశారు. గతంలో సిరివెన్నెలతో ఆకెళ్ళ సరదాగా కూర్చున్న సమయంలో 'తమసోమా జ్యోతిర్గమయ, అసతోమా సద్గమయ' అంటూ పాట పాడిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ చక్కని వీడియోను మీరు చూసేయండి.

Updated Date - Sep 19 , 2025 | 11:20 PM