Ramcharan Fans Vs Sirish: క్షమించండి.. నా మాట‌ల‌తో అపార్థాలు

ABN , Publish Date - Jul 01 , 2025 | 10:29 PM

టాలీవుడ్‌లో.. ఇటీవ‌ల ఇంట‌ర్వ్యూలు, ఈవెంట్లలో సెల‌బ్రిటీలు చాలామంది నోరు జార‌డం ప‌రిపాటి అయింది.

dil

టాలీవుడ్‌లో.. ఇటీవ‌ల ఇంట‌ర్వ్యూలు, ఈవెంట్లలో సెల‌బ్రిటీలు చాలామంది నోరు జార‌డం ఆపై అభిమానుల నుంచి ఓ రేంజ్‌లో ట్రోలింగ్ జ‌ర‌గ‌డం వెంట‌నే వాళ్లు రియాక్ట్ అయి క్ష‌మించ‌డండి అంటూ లెట‌ర్లు విడుద‌ల చేయ‌డం ప‌రిపాటి అయింది. తాజాగా ఈ లిస్టులో దిల్ రాజు ఫ్యామిలీ చేరింది. ఇయ‌న సోద‌రుడు శిరీష్ తాజాగా మీడియా ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రామ్‌చరణ్‌ (Ram charan) 'గేమ్‌ ఛేంజర్‌ (Game changer) పరాజయంపై మాట్లాడిన మాట‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో పెద్ద ర‌చ్చే చేస్తున్నాయి.

తమ్ముడు (Thammudu) సినిమాలో భాగంగా నిర్మాత శిరీష్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో 'గేమ్‌ ఛేంజర్‌' ఫ్లాప్‌ అయింది.. హీరో వచ్చి మాకేమన్నా హెల్ప్‌ చేశాడా? దర్శకుడు వచ్చి సాయం అందించాడా? కర్టెసీ కోసం కనీసం కాల్‌ చేసి, ఎలా ఉన్నారని కూడా ఇద్దరూ అడగలేదు’ అంటూ శిరీష్‌ వ్యాఖ్యలు చేశారు. దీనిపై రామ్‌చరణ్‌ అభిమానులు మండి పడ్డారు. గ్లోబల్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఫాన్స్ తీవ్రంగా ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ మండి పడుతున్నారు. దిల్‌ రాజు నిర్మాణ (Dil raju) సంస్థకు 'ఖబడ్దార్‌' అంటూ ఫ్యాన్‌ సవాల్‌ విసిరారు. సోష‌ల్‌ మీడియాలో ఓ లేఖ సైతం విడుదల చేశారు.

ram charan

దీంతో వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన దిల్ రాజు సోద‌రుడు శిరీష్ రెడ్డి ఓ లెట‌ర్ విడుద‌ల చేశారు. నేను ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు.. సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అపార్థాలకు దారి తీసి.. దాని వలన కొందరు మెగా అభిమానులు బాధ పడినట్లు తెలిసింది. గేమ్‌ ఛేంజర్ (Game Changer) సినిమా కోసం మాకు "Global Star" రామ్ చరణ్ తన పూర్తి సమయం, సహకారం అందించారు. మెగాస్టార్ చిరంజీవి గారి కుటుంబానికి మాకు ఎన్నో ఏళ్ళ నుండి సాన్నిహిత్యం ఉంది. మేము చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు మరియు మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా మాట్లాడము. ఒకవేళ నా మాటలు ఎవరి మనోభావాలను అయినా ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే... క్షమించండి అంటూ శిరీష్ రెడ్డి ఓ లెట‌ర్ రిలీజ్ చేశారు. ప్ర‌స్తుతం ఈ లెట‌ర్ నెట్టింట హాల్‌చ‌ల్ చేస్తోంది. దీంతో ఈ వివాదానికి ఎండ్ ప‌డిన‌ట్లేన‌ని అనుకుంటున్నారు.

Updated Date - Jul 01 , 2025 | 11:33 PM