Singer Kenisha: ఏం మాట్లాడినా నా ముఖంపై చెప్పండి..

ABN , Publish Date - May 12 , 2025 | 08:09 PM

నటుడు జయం రవి(Jayam Ravi), గాయని కెనీషాతో (Kenisha) కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ వార్తల్లో నిజం లేదని వీరిద్దరూ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పినప్పటికీ ఆ వార్తలు వైరల్‌ అవుతూనే ఉన్నాయి


నటుడు జయం రవి(Jayam Ravi), గాయని కెనీషాతో (Kenisha) కొంతకాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ వార్తల్లో నిజం లేదని వీరిద్దరూ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పినప్పటికీ ఆ వార్తలు వైరల్‌ అవుతూనే ఉన్నాయి. దానికితోడు ఇటీవల ఓ వేడుకలో ఇద్దరూ జంటగా సంప్రదాయ దుస్తుల్లో కనిపించడంతో ఆ వార్తలకు ఇంకాస్త ఊతం ఇచ్చినట్టు అయింది. దీనిపై రవి భార్య ఆర్తి (Aarti Ravi) ఒక స్టేట్‌మెంట్‌ రిలీజ్‌ చేశారు. దీనిపై తాజాగా కెనీషా పరోక్షంగా స్పందించారు. ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా తనకే చెప్పాలని సూచించారు. అంతేకాకుండా, ఆర్తికి సపోర్ట్‌ చేస్తూ తనపై విమర్శలు చేస్తోన్న మహిళలను ఉద్దేశించి కూడా ఆమె మాట్లాడారు. ఎవరి పని వాళ్లు చూసుకుంటే మంచిదన్నట్లు తెలిపారు.

‘‘నాతో ఏదైనా చెప్పాలనుకుంటే నన్నే సంప్రదించండి. నేరుగా నా ముఖంపై చెప్పండి. మీరు ఏం అనుకుంటున్నారో నాక్కూడా తెలుస్తుంది కదా! పీఆర్‌లను ఉపయోగించాల్సిన అవసరం లేదు. సొంత విషయాలు పట్టించుకోవడం మానేసి ఎవరైతే ఓవర్‌గా మాట్లాడుతున్నారో నా ముందుకు రండి. ఇతరుల దృష్టిని ఆకర్షించాలని మీరందరూ ఇప్పుడు కోరుకుంటున్నారని నాకు అనిపిస్తుంది. మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ అందరూ ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నా’’ అని కెనీషా సోషల్‌ మీడియాలో పేర్కొన్నారు.  

జయం రవి ఆర్తి నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు గతేడాది ప్రకటించారు. విడాకుల గురించి తనని సంప్రదించకుండానే ఆయన ప్రకటించారని ఆర్తి కామెంట్‌ చేశారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ గతేడాది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు విచారణలో ఉంది. ‘తండ్రి అంటే టైటిల్‌ మాత్రమే కాదు అదో బాధ్యత. విడాకుల విషయంలో తుది తీర్పు వెలువడే వరకూ నా సోషల్‌ మీడియా ఖాతాలన్నీ ఆర్తి రవి పేరుతోనే ఉంటుంది. ఇప్పటికీ నాన్నా అని నిన్ను పిలుస్తున్న పిల్లల కోసం నిలబడ్డా’’ అని ఆర్తి పేర్కొన్నారు.  

Updated Date - May 12 , 2025 | 08:45 PM