Parasakthi: ప‌రాశ‌క్తి నుంచి.. సింగారాల సీతాకోక‌వే సాంగ్! శ్రీలీల.. ఏదో మిస్స‌వుతుందే

ABN , Publish Date - Nov 06 , 2025 | 09:42 PM

ప‌రాశ‌క్తి సినిమా నుంచి “సింగారాల సీతాకోకవే.. నీ ఆలకే తొలగి గుండె మీద రంగే అయిందిలే” అనే మెలోడి సాంగ్‌ను విడుదల చేశారు.

Parasakthi

యువనటుడు శివకార్తికేయన్ (Sivakarthikeyan) 25వ చిత్రం 'పరాశక్తిస‌ (Parasakthi) సుధా కొంగర ( Sudha Kongara) దర్శకత్వంలో డ్వాన్ పిక్చర్స్ బ్యానర్పై ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్నారు. శ్రీలీల (Sreeleela) హీరోయిన్‌. రవి మోహన్ (Ravi Mohan) , అధర్వ ముర‌ళి (Atharvaa), ఫాసిల్ జోసెఫ్ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. సుమారు 150 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. రానున్న‌ సంక్రాంతికి మూవీని విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో తాజాగా గురువారం ఈ పరాశక్తి సినిమా నుంచి సింగారాల సీతాకోక‌వే.. నీ ఆల‌కే తొల‌గి గుండె మీద రంగే అయిందిలే (Singaaraala Seethaakoka) అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాట‌కు భాస్క‌ర‌బ‌ట్ల (Bhaskar Batla) సాహిత్యం అందించ‌గా జీవీ ప్ర‌కాష్ (G. V. Prakash Kumar) సంగీతంలో రేవంత్ (L. V. Revanth), డీ (Dhee) , సీన్ రోలండాన్ (Sean Roldan)ఆల‌పించారు. అయితే.. పాట‌కు తెర‌పై క‌నిపించే విజువ‌ల్స్‌కు, న‌టీన‌టులు ఆల‌పించే స‌మ‌యంలో సింక్ అవ‌లేద‌నే విష‌యం స్ప‌ష్టంగా అవ‌గ‌త‌మ‌వుతోంది. మ‌రి సినిమాలో స‌రి చేస్తారేమో చూడాలి

Updated Date - Nov 06 , 2025 | 09:42 PM