SIIMA 2025: ఆ రెండు చిత్రాలకు అవార్డుల పంట..

ABN , Publish Date - Sep 06 , 2025 | 09:05 AM

‘సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌’ (సైమా- 2025)వేడుక ఘనంగా జరిగింది. దుబాయ్‌ వేదికగా ‘సైమా’ 13వ ఎడిషన్‌ జరిగింది.

SIIMA 2025

‘సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌’ (సైమా- 2025)వేడుక ఘనంగా జరిగింది. దుబాయ్‌ వేదికగా ‘సైమా’ 13వ (SIIMA) ఎడిషన్‌ జరిగింది. మొదటి రోజు తెలుగు, కన్నడ చిత్రాలకు అవార్డులు అందజేశారు. 2024 సంవత్సరంలో విశేష ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు పురస్కార ప్రదానం చేశారు. పుష్ప-2(Pushpa 2), కల్కి (Kalki) చిత్రాలకు  నాలుగు విభాగాల్లో అవార్డులు వరించాయి. సైన్స్‌ ఫిక్షన్‌ జానర్‌తో తెరకెక్కి ప్రేక్షకుల్ని కొత్త లోకంలోకి తీసుకెళ్లిన ‘కల్కి 2898 ఏడీ’ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఉత్తమ నటుడిగా అల్ల్లు అర్జున్‌, ఉత్తమ నటిగా రష్మిక అవార్డులు సొంతం చేసుకున్నారు. ఉత్తమ దర్శకుడిగా సుకుమార్‌,. ఉత్తమ సంగీత దర్శకుడిగా దేవి శ్రీప్రసాద్‌ నిలిచారు. ప్రైడ్‌ ఆఫ్‌ తెలుగు సినిమా విభాగంలో వైజయంతీ మూవీస్‌ అధినేత అశ్వినీదత్ పురస్కారం అందుకున్నారు. 

Siima  (12).jpeg

‘సైమా’ 2025 విన్నర్స్‌ వీరే..

ఉత్తమ చిత్రం: కల్కి 2898 ఏడీ

ఉత్తమ నటుడు: అల్లు అర్జున్‌ (పుష్ప2) 

ఉత్తమ నటి: రష్మిక (పుష్ప2)  

ఉత్తమ దర్శకుడు: సుకుమార్ (పుష్ప2) 

ఉత్తమ విలన్‌: కమల్‌ హాసన్‌ (కల్కి 2898 ఏడీ)

Siima  (8).jpeg

ఉత్తమ సహాయ నటుడు: అమితాబ్‌ బచ్చన్‌ (కల్కి 2898 ఏడీ)

ఉత్తమ సహాయ నటి: అన్నా బెన్‌ (కల్కి 2898 ఏడీ)

ప్రైడ్‌ ఆఫ్‌ తెలుగు సినిమా : అశ్వినీదత్ (వైజయంతీ మూవీస్‌)

ఉత్తమ సంగీత దర్శకుడు: దేవి శ్రీ ప్రసాద్‌ (పుష్ప2)

ఉత్తమ దర్శకుడు (క్రిటిక్స్‌): ప్రశాంత్‌ వర్మ (హనుమాన్‌)

Siima  (8).jpeg

ఉత్తమ సినిమాటోగ్రఫీ: రత్నవేలు (దేవర)

ఉత్తమ గీత రచయిత: రామజోగయ్య శాస్త్రి (చుట్టమల్లే)

ఉత్తమ నేపథ్య గాయని: శిల్పారావ్‌ (చుట్టమల్లే)

ఉత్తమ పరిచయ నటి: భాగ్యశ్రీ బోర్సే (మిస్టర్‌ బచ్చన్‌)

ఉత్తమ హాస్య నటుడు: సత్య (మత్తు వదలరా 2)

Siima  (3).jpeg

ఉత్తమ నూతన నిర్మాత : నిహారిక కొణిదెల (కమిటీ కుర్రోళ్లు)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): తేజ సజ్జా (హనుమాన్‌) 

ఉత్తమ నటి (క్రిటిక్స్‌): మీనాక్షి చౌదరి (లక్కీ భాస్కర్‌)

Siima  (10).jpeg

Updated Date - Sep 06 , 2025 | 09:10 AM