Swetha menon: 31 ఏళ్ల ‘అమ్మ’ చరిత్రలో తొలి మహిళగా..
ABN , Publish Date - Aug 16 , 2025 | 08:22 PM
అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) అధ్యక్షురాలిగా శ్వేతా మేనన్ ఎన్నికయ్యారు. ప్రత్యర్థి దేవన్‌పై గెలిచిన ఆమె.. ‘అమ్మ’ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తొలి నటిగా రికార్డు నెలకొల్పారు.
అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) అధ్యక్షురాలిగా శ్వేతా మేనన్ ఎన్నికయ్యారు. ప్రత్యర్థి దేవన్‌పై గెలిచిన ఆమె.. ‘అమ్మ’ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తొలి నటిగా రికార్డు నెలకొల్పారు. లక్ష్మీ ప్రియ ఉపాధ్యక్షురాలిగా, కుక్కు పరమేశ్వరన్ జాయింట్ సెక్రటరీగా, అన్సిబా హాసన్ జనరల్ సెక్రటరీ పదవులు అందుకున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొచ్చిలో ఓటింగ్ జరిగింది. సాయంత్రం ఫలితాలను వెల్లడించారు. 506 మంది సభ్యులకు ఓటు హక్కు ఉండగా 298 మంది ఆ హక్కును వినియోగించుకున్నారు. స్టార్స్ కొందరు ఓటు వేయలేదని మలయాళ మీడియా చెబుతోంది.
మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రారంభమై 31 ఏళ్లు అవుతుంది. ఎం.జి. సోమన్, మధు, మోహన్‌లాల్ తదితరులు అధ్యక్షులుగా పని చేశారు. పలువురు నటులు, దర్శకులపై నటీమణులు చేస్తున్న లైంగిక ఆరోపణల నేపథ్యంలో నైతిక బాధ్యతగా ‘అమ్మ’ అచ?ల్యీక్ష పదవికి అగ్ర కథానాయకుడు మోహన్‌లాల్ గతేడాది రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో, 2027లో నిర్వహించాల్సిన ఎన్నికలను ఈ ఏడాది నిర్వహించారు. కొన్ని రోజుల క్రితం నటి శ్వేతా మేనన్‌పై ఓ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆమె గెలుస్తారా? లేదా? అన్న అనుమానం మలయాళ పరిశ్రమలో నెలకొంది. ఎట్టకేలకు ఆమె అఽధ్యక్ష పదవిని అందుకున్నారు.