Shriya Saran: స్విమ్మింగ్ పూల్‌లో శ్రియ జలకాలాటలు..
ABN , Publish Date - Jun 09 , 2025 | 08:25 PM
శ్రియ స్టైలింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సందర్భాన్ని బట్టి ఆమె డ్రెసింగ్ ఉంటుంది. సరదాగా టూర్లు, షికార్లు అంటే మామూలుగా ఉండదు.
శ్రియ (Shriya Saran) స్టైలింగ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సందర్భాన్ని బట్టి ఆమె డ్రెసింగ్ ఉంటుంది. సరదాగా టూర్లు, షికార్లు అంటే మామూలుగా ఉండదు. కంఫర్ట్ డ్రెస్ ధరించి కుర్రకారుని పిచ్చెక్కిస్తుంది. అదే స్విమ్మింగ్ పూల్, బీచ్‌ల వైపు వెళ్లింది అంటే ఇక చెప్పాల్సిన పనే లేదు. బికినీని మించి పొట్టి దుస్తులతో సెగ పుట్టిస్తుంటుంది. తాజాగా అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల తన భర్త అండ్రూ కొశ్చివ్, తన బిడ్డ రాధా శరన్ కొశ్చివ్‌తో (Radha Saran) కలిసి టూర్‌కి వెళ్లారు శ్రియ. తన కాటేజ్ ప్రాంగణంలో ఉన్న స్విమింగ్ ఫూల్‌లో శ్రియ జలకాలాడారు.
వైట్ టూ పీస్ (Shriya Saran Bikini) ధరించి హోయలొలికిస్తూ పూల్‌లోకి దిగిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే ఆ వీడియోలో భర్త ఆండ్రూ, తన కూతురు రాధా శరన్ కూడా ఉన్నారు. ఆ దుస్తుల్లో శ్రియను చూసిన యువతకు ఊపిరాడటం లేదని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. కొందరైతే భర్త, పిల్లను పక్కన పెట్టుకుని శ్రియ ఇంత హాట్‌గా కనిపించడం అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. టాలీవుడ్‌లో అగ్ర హీరోలు అందరితో సినిమాలు చేసి సక్సెస్‌ఫుల్‌గా కెరీర్ సాగించిన శ్రియ అండ్రూను పెళ్లాడిన తర్వాత సినిమాలు తగ్గించారు. తెలుగులో గతేడాది తెలుగులో 'మ్యూజిక్ స్కూల్', ఈ ఏడాది తమిళంలో 'రెట్రో' చిత్రంలో ప్రత్యేక పాత్రతో మెప్పించారు.