Biggboss 9: శ్రేష్టి వర్మ.. ఆట లేదు... ఓటింగ్ లేదు..
ABN , Publish Date - Sep 14 , 2025 | 06:53 PM
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (biggboss9) ప్రారంభమై వారం పూర్తయింది. అయితే గత సీజన్ లా కాకుండా సోసోగా ఈ సీజన్ సాగుతోంది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 (biggboss9) ప్రారంభమై వారం పూర్తయింది. అయితే గత సీజన్ లా కాకుండా సోసోగా ఈ సీజన్ సాగుతోంది. ఈ వారం తొలి ఎలిమినేషన్‌కు సంబంధించిన వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. రాము రాథోడ్, ఇమ్మాన్యుయెల్, సంజన గల్రానీ, ఫ్లోరా సైనీ, తనూజ గౌడ, శ్రేష్టి వర్మ (Shrasti verma), రీతూ చౌదరి, భరణి శంకర్, సుమన్ శెట్టి మొత్తం తొమ్మిది మంది మొదటి వారం నామినేషన్‌లో నిలిచారు. ఓటింగ్ ప్రకారం కొందరు కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లోకి వెళ్లారు. ఫ్లోరా సైనీ, శ్రేష్టి వర్మ తక్కువ ఓటింగ్ పొందారు. అలాగే ఆట కూడా పెద్దగా ఆడలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే డాన్సర్ శ్రేష్టి వర్మ ఎలిమినేట్ అయిందని వార్తలు వస్తున్నాయి. ఫస్ట్ ఎలిమినేషన్ షూటింగ్ శనివారమే జరిగిపోయింది.
ఆదివారం రాత్రి ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ షోలో ఆమె పారితోషికం గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. షోలో పాల్గొన్నందుకు రోజుకు ఆమె రెమ్యునరేషన్ సుమారు రూ. 28,571 అని తెలిసింది. ఆ రకంగా చూస్తే ఈ వారంలో ఆమె దాదాపుగా రెండు లక్షలు సంపాదించినట్లే. ఇక ఆమె గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై కేసు వేయడంతో శ్రేష్టి వర్మ పాపులర్ అయింది. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడంటూ శ్రేష్టి వర్మ అప్పట్లో ఆరోపణలు చేసింది. దాంతో జానీ మాస్టర్ జైలుకి వెళ్లారు. తర్వాత బెయిల్‌పై బయటికొచ్చారు. ఇప్పుడు శ్రేష్టి వర్మ పలు సినిమాలకు డాన్స్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తోంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళే ముందే నాగార్జునతో మీతో వర్క్ చేయాలని ఉందని శ్రేష్టి చెప్పినప్పుడు నాగ్... అయితే హౌస్ నుండి త్వరగా వచ్చేయ్ అని అన్నారు. ఇప్పుడు అదే జరిగిందనిపిస్తోంది.