Shrasti Verma: మాస్టర్ జీ.. మీ పాఠాల వలనే ఎదిగాను

ABN , Publish Date - Jun 28 , 2025 | 04:41 PM

శ్రేష్టి వర్మ (Shrasti Verma).. ఈ ఏడాది సోషల్ మీడియాలో బాగా వినిపించిన పేరు. జానీ మాస్టర్ (Jani Master) పై అమ్మడు వేసిన కేసు గురించి అందరికీ తెల్సిందే.

Shrasti Verma

Shrasti Verma: శ్రేష్టి వర్మ (Shrasti Verma).. ఈ ఏడాది సోషల్ మీడియాలో బాగా వినిపించిన పేరు. జానీ మాస్టర్ (Jani Master) పై అమ్మడు వేసిన కేసు గురించి అందరికీ తెల్సిందే. తనను పెళ్లి చేసుకోమని బలవంతపెట్టాడని, అతని భార్య తనను మతం మార్చుకోమని భయపెట్టిందని పోలీసులకు ఫిర్యాదు చేయడం, జానీ మాస్టర్ ను అరెస్ట్ చేయడం, జైలుకు తీసుకెళ్లడం జరిగాయి. ఇక ఆమె చేసిన పని వలన జానీ మాస్టర్ కు రావాల్సిన జాతీయ అవార్డు కూడా వెనక్కి వెళ్ళిపోయింది. ఆయన పరువు పోయింది. ప్రస్తుతం జానీ మాస్టర్ బెయిల్ పై బయట ఉన్నాడు.


ఇక ఈ కేసు గురించి ఇండస్ట్రీలో రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు. శ్రేష్టి వర్మ.. జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ గా చేరి, అవకాశాలు అందుకొని.. ఇప్పుడు ఒక స్టేజ్ కు వచ్చాకా అతడి గురించి బయటపెట్టడం అనేది తప్పు అని, ఆమె కావాలనే ఇదంతా చేసిందని కామెంట్స్ చేశారు. ఇంకోపక్క జానీ మాస్టర్ కూడా ఇలా చేయడం పద్దతి కాదని, భార్య ఉండగా వేరొక అమ్మాయితో, అది తన దగ్గర పనిచేసేవారితో ఇలా ప్రవర్తించడం తప్పు అని చెప్పుకొచ్చారు. ఇక కాలం అన్ని మరిపిస్తుంది అన్నట్లు ఇప్పుడు ఇద్దరు ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉన్నారు.


పుష్ప 2 సినిమాలోని సూసేకి అగ్గిరవ్వ మాదిరి సాంగ్ కు కొరియోగ్రఫీ చేసింది శ్రేష్టి వర్మనే. ఈ సాంగ్ కు మంచి గుర్తింపు రావడంతో పాటు శ్రేష్టి వర్మను సుకుమార్ తెగ మెచ్చుకున్నాడు. ఈ సినిమా తరువాత ఈమెకు వరుస అవకాశాలు తలుపుతట్టాయి. ప్రస్తుతం శ్రేష్టి వర్మ.. నాగబంధనం సినిమాలో ఒక సాంగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సాంగ్ ఫినిష్ అవ్వడంతో తనకు అవకాశం ఇచ్చిన చిత్రబృందానికి, సాంగ్ చేసిన గణేష్ ఆచార్య మాస్టర్ కు శ్రేష్టి వర్మ థ్యాంక్స్ చెప్తూ పోస్ట్ పెట్టింది.


' నాగబంధనం నుంచి మరో భక్తి గీతాన్ని ఫినిష్ చేశాం. ఈ సాంగ్ లోని ప్రతి పదం భక్తితో కూడుకున్నది. ఈ పాట కేవలం సంగీతం మాత్రమే కాదు ఇదొక ప్రార్ధనా గీతం. ఈ క్షణాన్ని నాకు అందించిన నిర్మాత అభిషేక్ నామా సర్ కు, నిఖితా మేడమ్ కు థ్యాంక్స్. గణేష్ ఆచార్య మాస్టర్ జీకి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను మాస్టర్ జీ. మీ మార్గదర్శకత్వం మరియు మీ ఓర్పు నాపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి. మీరు నేర్పే విధానం, మీరు పంచె జ్ఞానం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. మీరు నేర్పిన ప్రతి పాఠం.. నాలో విశ్వాసాన్ని పెంచడమే కాకుండా క్రమశిక్షణగా కూడా ఎదగడానికి సహాయపడింది' అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.

Updated Date - Jun 28 , 2025 | 04:41 PM