Peddi: పెద్దిలో చిరు హీరోయిన్.. కావాలనే తీసుకున్నారా
ABN , Publish Date - Nov 11 , 2025 | 06:47 PM
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పెద్ది (Peddi).
Peddi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పెద్ది (Peddi). ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించారు. ఇక ఈ చిత్రంలో కన్నడ సీనియర్ హీరో శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే పెద్ది చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ షాట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ మధ్యనే రిలీజ్ అయిన మొదటి సాంగ్ చికిరి చికిరి ట్రెండ్ సృష్టించింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, చరణ్ గ్రేస్, స్టెప్పులు, జాన్వీ అందం సాంగ్ ను ఎక్కడికో తీసుకెళ్లాయి. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27 న ప్రేక్షకుల ముందుకు రానుంది. పెద్దిపై అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. బుచ్చి సైతం ఆ అంచనాలకు తగ్గట్లు మంచి అవుట్ ఫుట్ ను అందిస్తున్నాడు.
ఇక ఇంకా పెద్ది హైప్ ను పెంచడానికి ప్రతి క్యారెక్టర్ కోసం స్టార్స్ నే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమాలోని ఒక కీలక పాత్ర కోసం పద్మభూషణ్ అవార్డు గ్రహీత శోభనను సెలెక్ట్ చేసినట్లు సమాచారం. పెద్దిలో ఒక పవర్ ఫుల్ లేడీ క్యారెక్టర్ ఉందట. దానికోసం చాలామంది నటీమణులను వెతికి వెతికి.. ఎక్కడా దొరకక చివరికి చిరంజీవి తో నటించిన సీనియర్ హీరోయిన్లందరిలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేద్దామని అనుకున్నాడట. అలా శోభన ఆ పాత్రకు బాగా నప్పుతుందని ఆమెను సెలెక్ట్ చేసినట్లు టాక్. అందులో శోభన.. చిరుకు చాలా ఫెవరేట్ హీరోయిన్ కావడంతో ఆమె పేరే టాప్ లో ఉందంట. అందుకే కావాలనే ఆమెను తీసుకున్నారట.
శోభన ఈ మధ్యనే సినిమాలు చేయడం మొదలుపెట్టింది. కల్కిలో ఒక చిన్న పాత్రలో నటించిన ఆమె.. తుడురం లో మోహన్ లాల్ సరసన మంచి పాత్రలో నటించింది. పెద్ది పాత్ర కూడా నచ్చడంతో ఆమె వెంటనే ఓకే చేసిందని టాక్. మరి ఈ శోభన వలన పెద్దికి మరింత హైప్ వస్తుందేమో చూడాలి.