ఆ సన్నివేశాలు హైలెట్‌గా ఉంటాయి
ABN , Publish Date - Jun 26 , 2025 | 01:57 AM
‘‘కన్నప్ప’ వంటి గొప్ప చిత్రంలో భాగమయ్యే ఉద్దేశంతో ఇందులో నా పాత్ర నిడివి, ప్రాముఖ్యం తక్కువైనా వెంటనే అంగీకరించాను’’ అని అన్నారు...
‘‘కన్నప్ప’ వంటి గొప్ప చిత్రంలో భాగమయ్యే ఉద్దేశంతో ఇందులో నా పాత్ర నిడివి, ప్రాముఖ్యం తక్కువైనా వెంటనే అంగీకరించాను’’ అని అన్నారు నటుడు శివబాలాజీ. ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కన్నప్ప’. మంచు విష్ణు కథానాయకుడిగా ముఖే్‌షకుమార్ సింగ్ దర్శకత్వంలో డా.మోహన్‌బాబు నిర్మించారు. ప్రభాస్, మోహన్‌బాబు, అక్షయ్‌కుమార్, మోహన్‌లాల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ శుక్రవారం సినిమా విడుదలవుతున్న సందర్భంగా మీడియాతో శివబాలాజీ ముచ్చటించారు. ‘‘ఇందులో మహదేవ శాస్త్రి (మోహన్‌బాబు) కొడుకుగా నటించాను. సినిమా చూశాను. అద్భుతంగా ఉంది. సెకండా్‌ఫలో ప్రభాస్ ఎంట్రీ తరువాత నెక్స్ట్ లెవెల్‌కు వెళుతుంది. ప్రభాస్, విష్ణుల మధ్య వచ్చే సన్నివేశాలు హైలెట్‌గా ఉంటాయి. మోహన్‌లాల్ ఎంట్రీ గగుర్పుడిచేలా ఉంటుంది. అక్షయ్‌కుమార్ పాత్ర ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. ఆయన పాత్ర సినిమాపై చాలా ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్నాను. త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటిస్తాను’’ అని చెప్పారు.