Shivarajkumar: పవర్‌ఫుల్‌ పాత్రలో

ABN , Publish Date - Jul 13 , 2025 | 02:16 AM

రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘పెద్ది’. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థల సమర్పణలో వృద్ధి సినిమాస్‌ బేనర్‌పై వెంకట సతీష్‌ కిలారు...

రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘పెద్ది’. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థల సమర్పణలో వృద్ధి సినిమాస్‌ బేనర్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్‌ షాట్‌ గ్లింప్స్‌తో దేశవ్యాప్తంగా అంచనాలను పెంచేసింది. కన్నడ సూపర్‌ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ ఈ చిత్రంలో ‘గౌర్నాయుడు’ అనే పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. శనివారం ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా శివరాజ్‌కుమార్‌ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ని మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. కాగా, ఈ సినిమాలో రామ్‌చరణ్‌ సరసన కథానాయికగా జాన్వీకపూర్‌ నటిస్తున్నారు. జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న రామ్‌చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా సినిమా విడుదల కానుంది.

Updated Date - Jul 13 , 2025 | 02:16 AM