Shivaji: అమ్మా హీరోయిన్లు.. సామాన్లు అలా చూపించకండి! శివాజీ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Dec 23 , 2025 | 09:17 AM
దండోరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈ మూవీ నటులందరూ హజరై సినిమా గురించి, తమ ఎక్స్ పీరియన్స్ పంచుకున్నారు.
శివాజీ (Shivaji), నవదీప్ (Navdeep), నందు (Nandu), బింధు మాదవి (Bindu Madhavi), రవి వర్మ కీలక పాత్రల్లో నటించిన చిత్రం దండోరా (Dhandoraa). ఈ క్రిస్మస్‌కు థియేటర్లకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్లు చేస్తూ సినిమాను జనంలోకి భారీగా తీసుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో తాజాగా సోమవారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా ఈ మూవీ నటులందరూ హజరై సినిమా గురించి, తమ ఎక్స్ పీరియన్స్ పంచుకున్నారు.
ఈ సందర్భంగా.. శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనంగా మారాయి. ముందుగా ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా అనీల్ రావిపూడి విచ్చేయడంపై ప్రశంసలు కురిపించారు. బిగ్‌బాస్ వచ్చాక కోర్టుకన్నా ముందే ఒప్పుకున్న చిత్రం దండోరా అని సినిమా కథ నన్ను అంత అమితంగా ఆకట్టుకుందని అన్నారు. ఈ శుక్రవారం వస్తున్న చాలా చిత్రాలలో మాది చిన్న చిత్రమని కానీ రిలీజ్ అయిన సాయంత్రం ఇదో పెద్ద సినిమా అవుతుందని దండోరా అనేది రాష్ట్రం, దేశం అంతా వినిపిస్తుందని అన్నారు.
చివరగాఆయన తన ప్రసంగం ముగిస్తూ.. నిండైన చీరకట్టులో వచ్చిన యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి మాట్లాడుతూ ఆమె డ్రెస్ సెన్స్ బావుందని పొగడ్తలు కురిపించారు. ఆపై హీరోయున్ల విషయం ప్రస్తావనకు తీసుకువచ్చి హీరోయిన్లు మీరేమి అనుకోవద్దు కానీ ఏ బట్టలు పడితే అవి వేసుకుని పోవద్దమ్మా.. మనం దరిద్రం అనుభవించాల్సి వస్తుందని, మీ అందం నిండైన బట్టల్లో, చీరల్లోనే ఉంటుంది తప్పితే సామాన్లు కనపకనబడే దాంట్లో ఏం ఉండదమ్మా అంటూ హితవు పలికారు.
అలాంటి బట్టలు వేసుకున్నంత మాత్రానా జనం చూసిలోపల తిట్టుకుంటారే తప్పితే మరేం లాభం ఉండదని అన్నారు. ఇంకా మేం ఎక్కువ మాట్లాడితే స్త్రీ స్తాతంత్య్రం అంటూ మీదకు వస్తారని కానీ స్తీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంద గౌరవం పెరుగుతుంది. సావిత్రి, సౌందర్య లా గుండెల్లో నిలడి పోతారని అన్నారు. స్వేచ్చ అనేది అదృష్టమని దానిని కోల్పోవద్దని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.