Shivaji: నేను.. భయపడే రకాన్ని కాదు! నాపై.. ఇంత కుట్రనా? తప్పు మాట్లాడలేదు

ABN , Publish Date - Dec 28 , 2025 | 08:43 AM

మహిళల దుస్తులపై వ్యాఖ్యల వివాదంలో తెలంగాణ మహిళా కమిషన్ ముందు హాజరైన సినీ నటుడు శివాజీ. తన మాటలపై విచారం వ్యక్తం చేస్తూ వివరణ ఇచ్చారు.

shivaji

నేను అనవసరంగా సలహాలు ఇచ్చాను.. ఎవరి హక్కులకు భంగం కలిగినా రక్షించే వ్యవస్థలు ఉన్నాయి, ఇకపై ఎవరికీ సలహాలు ఇవ్వకూడదని అర్థమైందని సినీ నటుడు శివాజీ (shivaji) అన్నారు. మహిళల దుస్తులపై దండోరా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో శివాజీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ ఆయనకు స్వయంగా కమిషన్‌ ముందు హాజరు కావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది.

ఈ నేప‌థ్యంలో శనివారం శివాజీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నేరెళ్ల శారద ముందు హాజరై వివరణ ఇచ్చారు. అనంతరం శివాజీ మాట్లాడుతూ.. నా వ్యాఖ్యల వల్ల బాధపడ్డ వారి తరఫున కమిషన్‌ ప్రశ్నలు అడిగిందని, వాటికి తాను సమాధానాలు చేప్పానన్నారు. ఎవరినీ నొప్పించాలని మాట్లాడలేదని, ఇటీవల చోటు చేసుకున్న సంఘటనల నేపఽధ్యంలో మాట్లాడేటప్పుడు తప్పులు దొర్లాయని అన్నారు.

నాకు బాగా కావలిసిన వారు ఇంత కుట్ర చేస్తారనుకోలేదని బాధను వ్యక్త పరిచారు. అయినా భయపడే రకాన్ని నేను కాదని అన్నారు. కమిషన్‌ అడిగిన వాటికి సమాదానాలు చెప్పానని, ఇంకా వివరణ కావాల్సి వస్తే మళ్లీ కమిషన్‌ ముందుకు వస్తానని, వాళ్లకు నచ్చని ఆ మాటలను వెనక్కి తీసుకుంటున్నా అని ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దామన్నారు. సినిమాలు రాకపోతే వ్యవసాయం చేసుకుని బతుకుతానని అన్నారు.

Updated Date - Dec 28 , 2025 | 08:43 AM