Nandamuri Balakrishna: త‌మ‌న్‌కు శివుడు పూనాడు.. అప్ప‌ట్లోనే.. బాక్సులు పగిలిపోయాయి!

ABN , Publish Date - Nov 22 , 2025 | 08:59 AM

త‌మ‌న్‌కు శివుడు పూనాడు.. అప్ప‌ట్లోనే.. బాక్సులు పగిలిపోయాయి! అంటూ బాల‌కృష్ణ త‌మ‌న్‌ను ఉద్దేశించి ఆస‌క్తిక‌ర వ్య‌ఖ్య‌లు చేశారు.

Nandamuri Balakrishna

నందమూరి బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శ్రీను (Boyapati Srinu) కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న డివైన్ యాక్షన్ ఫిల్మ్ అఖండ 2 తాండవం (Akhanda2 Thandavam). రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. తేజస్వినీ నందమూరి సమర్పణలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ట్రైలర్‌ను శుక్రవారం కర్ణాటకలో విడుదల చేశారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ (Shiva Raj Kumar) ఈ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరై ట్రైలర్‌ను లాంచ్ చేశారు.

ఈ సభలో బాలకృష్ణ మాట్లాడుతూ 'ఉదయం వర్ష సూచన లేదు. మేం హోటల్కు వచ్చేటప్పటికి కుంభవృష్టి కురిసింది, మళ్లీ వేదికపైకి వచ్చేసరికి వర్షం లేదు. ఇదంతా శివుని మహిమ. 'అఖండ 2' పాన్ ఇండియా సినిమా. ఈ చిత్రంలో సనాతన ధర్మం పరాక్రమం చూస్తారు. థియేటర్లో బాక్సులు పేలిపోయే మ్యూజిక్ ఇచ్చాడు తమన్' అన్నారు.

'బాలయ్యగారి నటన, డైలాగులు, యాక్షన్లో ఓ అద్భుతమైన ఎనర్జీ ఉంటుంది. డిసెంబర్ 5న విడుదలయ్యే ఈ చిత్రం కచ్చితంగా విజయం సాధిస్తుంది అని శివరాజ్ కుమార్ అన్నారు. శివతత్వం కలిగిన అద్భుతమైన చిత్రం అఖండ 2 ట్రైలర్‌ను శివన్న విడుదల చేయడం గర్వంగా ఫీలవుతున్నా నని దర్శకుడు బోయపాటి శ్రీను చెప్పారు. డిసెంబర్ 5న అంతా అఖండ తాండవ శబ్దమే అని నిర్మాత గోపీ ఆచంట అన్నారు.

Updated Date - Nov 22 , 2025 | 08:59 AM