Nari nari naduma murari: 'నారి నారి నడుమ మురారి' విడుదల అప్పుడే
ABN , Publish Date - Dec 09 , 2025 | 07:31 PM
ఈ సంక్రాంతికి రానున్న సినిమాలకు పెద్ద పోటీనే ఉంది. తెలుగువారి పెద్ద పండుగకు వినోదం పంచేందుకు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న సినిమాలు రిలీజ్ కు రెడీ అంటున్నాయి.
ఈ సంక్రాంతికి రానున్న సినిమాలకు పెద్ద పోటీనే ఉంది. తెలుగువారి పెద్ద పండుగకు వినోదం పంచేందుకు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న సినిమాలు రిలీజ్ కు రెడీ అంటున్నాయి. శర్వానంద్ హీరోగా నటించిన ‘నారీ నారీ నడుమ మురారి’ (Nari Nari Naduma Murari) కూడా సంక్రాంతి బరిలోనే ఉంది. సినిమా విడుదల తేదీతో పటు సమయాన్ని కూడా వెల్లడించింది ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ. మార్నింగ్ షో, మ్యాట్నీలు కాకుండా ఫస్ట్ షోతో జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ రోజు సాయంత్రం 5:49 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
శర్వా సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్య కథానాయికలుగా నటిస్తున్నారు. రామ్ అబ్బ రాజు దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ సుంకర, రామ్ బ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్నారు.