Sharwanand: బుక్ నీది.. పెన్ను నీది.. స్టోరీ నీది.. ఇష్టం వచ్చినాట్లు రాసుకోండి
ABN , Publish Date - Nov 14 , 2025 | 03:45 PM
యంగ్ హీరో శర్వానంద్(Sharwanand) ప్రస్తుతం ఒక మంచి విజయం కోసమా ఎదురుచూస్తున్నాడు. శర్వా ప్రస్తుతం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
Sharwanand: యంగ్ హీరో శర్వానంద్(Sharwanand) ప్రస్తుతం ఒక మంచి విజయం కోసమా ఎదురుచూస్తున్నాడు. శర్వా ప్రస్తుతం రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. డిసెంబర్ లో బైకర్(Biker) తో మెప్పించడానికి సిద్దమైన శర్వా.. సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారీ సినిమాతో రానున్నాడు. ఇక బైకర్ సినిమా రిలీజ్ కు దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన శర్వా.. కాలేజ్ లను విజిట్ చేస్తూ స్టూడెంట్స్ తో మమేకమై సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నాడు.
తాజాగా గచ్చిబౌలిలోని రిజోనెన్స్ కాలేజ్ ఫెస్ట్ కి ముఖ్య అతిధిగా విచ్చేశాడు. శర్వా రాకతో స్టూడెంట్స్ మరింత సందడి చేశారు. ఇక ఈ ఫెస్ట్ లో బైకర్ గురించిన విశేషాలను శర్వా స్టూడెంట్స్ తో పంచుకున్నాడు. అంతేకాకుండా స్టూడెంట్స్ మోటివేషనల్ స్పీచ్ కూడా ఇచ్చాడు. జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా లేచి నిలబడాలని, తమ జీవితంలో నువ్వు ఏం చేయాలో.. ఏం చేయకూడదో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదని.. నిన్ను నువ్వు నమ్మితే సక్సెస్ అదే వస్తుందని తెలిపాడు.
' నేను కొన్ని విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నా లైఫ్ లో నేను చాలాసార్లు పడ్డాను, ఓడిపోయాను, మోసపోయాను. కానీ, పడిన ప్రతిసారి లైఫ్ లో ఒకటి నేర్చుకున్నాను. మన కథ మనమే రాసుకోవాలి.. నువ్వేం చేయాలో.. ఏం చేయకూడదో ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు. బుక్ నీది.. పెన్ను నీది.. స్టోరీ నీది.. ఇష్టం వచ్చినట్లు రాసుకోండి. ఈ మధ్యనే నేను నాలుగు విషయాలు నేర్చుకున్నాను. అవి మీకు చెప్తాను. నిన్ను నువ్వు నమ్ము... ఎప్పుడు గివ్ అప్ ఇవ్వకు.. నువ్వే నీకు హీరో.. ప్రేమతో జీవించు.. అంటూ స్టూడెంట్స్ చేత ప్రమాణం చేయించాడు. ప్రస్తుతం శర్వా స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.