King movie shoot break: గాయపడిన షారుక్‌ షూటింగ్‌కు బ్రేక్‌

ABN , Publish Date - Jul 20 , 2025 | 04:19 AM

సినిమా కోసం చెమటోడ్చే హీరోల్లో షారుక్‌ ఖాన్‌ ముందుంటారు. ప్రేక్షకులను అలరించడానికి మూడు దశాబ్దాలుగా ఆయన కృషి చేస్తూనే ఉన్నారు. 60 ఏళ్ల వయసులోనూ...

సినిమా కోసం చెమటోడ్చే హీరోల్లో షారుక్‌ ఖాన్‌ ముందుంటారు. ప్రేక్షకులను అలరించడానికి మూడు దశాబ్దాలుగా ఆయన కృషి చేస్తూనే ఉన్నారు. 60 ఏళ్ల వయసులోనూ తెరపై షారుక్‌ చేసే సాహసాలు అబ్బురపరుస్తూంటాయి. డూప్‌ లేకుండా యాక్షన్‌ సీన్లలో పాల్గొనే షారుక్‌ తాజాగా ‘కింగ్‌’ చిత్రం షూటింగ్‌లో ప్రమాదానికి గురయ్యారు. ముంబైలోని గోల్డెన్‌ టుబాకో స్టూడియోలో ఓ భారీ యాక్షన్‌ ఎపిసోడ్‌ తీస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది. అయితే ఇది తీవ్రమైన గాయం కాదు, కండరానికి సంబంధించింది కనుక చికిత్స అవసరం అని అమెరికాకు ఆయన్ని తీసుకెళ్లారు. నెల రోజుల పాటు షారుక్‌కు విశ్రాంతి అవసరమని వైద్యులు వెల్లడించారు. దీంతో ఆగస్టు నెల వరకూ ఏకధాటిగా జరగాల్సిన ‘కింగ్‌’ షూటింగ్‌కు బ్రేక్‌ ఇచ్చారు. షారుక్‌ కోలుకుని తిరిగి వచ్చిన తర్వాత సెప్టెంబర్‌లో కానీ అక్టోబర్‌లో కానీ మళ్లీ షూటింగ్‌ను ప్రారంభిస్తామని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇండియాతో పాటు యూర్‌పలో కూడా ‘కింగ్‌’ షూటింగ్‌ జరపాలని ప్లాన్‌ చేశారు. షారుక్‌ ఖాన్‌ కుమార్తె సుహానా ప్రధాన పాత్ర పోషిస్తున్న ‘కింగ్‌’ చిత్రాన్ని సిద్ధార్థ్‌ ఆనంద్‌ రూపొందిస్తున్నారు.

Updated Date - Jul 20 , 2025 | 04:19 AM