షఫాలీ మృతికి కారణమిదేనా
ABN , Publish Date - Jun 30 , 2025 | 02:26 AM
‘కాంటా లగా’ సాంగ్ ఫేమ్ షఫాలీ జరివాలా(42) ఆకస్మిక మృతిపై పలు అనుమానాలు రేకెత్తుతున్న సంగతి తెలిసిందే. ఆమె గుండెపోటుతో...
‘కాంటా లగా’ సాంగ్ ఫేమ్ షఫాలీ జరివాలా(42) ఆకస్మిక మృతిపై పలు అనుమానాలు రేకెత్తుతున్న సంగతి తెలిసిందే. ఆమె గుండెపోటుతో మరణించారని మొదట వార్తలు వచ్చాయి. ఆమె కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు మృతికి గల పూర్తి కారణాలను ఇంకా వెల్లడించలేదు. మరోవైపు అందంపై ఉన్న మమకారమే ఆమె ప్రాణాలు కోల్పోయేలా చేసిందని నెట్టింట వార్తలు వస్తున్నాయి. ఆమె కొంతకాలంగా యాంటీ ఏజింగ్ చికిత్సను తీసుకుంటున్నట్లు సమాచారం. శుక్రవారం ఇంట్లో పూజ ఉండడంతో ఆమె ఆ రోజంతా ఉపవాసం ఉన్నారని.. ఖాళీ కడుపుతో యాంటీ ఏజింగ్ ఔషధాలు, ఇంజెక్షన్లు తీసుకోవడంతో అవి వికటించి గుండెపోటుకు దారి తీసుంటాయని వార్తలు వస్తున్నాయి.