Senthil Kumar: కథ విని ఉద్వేగానికి లోనయ్యా
ABN , Publish Date - Jul 13 , 2025 | 02:14 AM
‘ఒక సినిమా అంగీకరించే ముందు కథలో ప్రేక్షకులను కదిలించే బలమైన భావోద్వేగాలు ఉన్నాయా, లేవా? అని చూస్తాను. ‘జూనియర్’ సినిమా స్ర్కిప్ట్ నాకు బాగా నచ్చింది. కథ విని ఉద్వేగానికి లోనయ్యా....
‘ఒక సినిమా అంగీకరించే ముందు కథలో ప్రేక్షకులను కదిలించే బలమైన భావోద్వేగాలు ఉన్నాయా, లేవా? అని చూస్తాను. ‘జూనియర్’ సినిమా స్ర్కిప్ట్ నాకు బాగా నచ్చింది. కథ విని ఉద్వేగానికి లోనయ్యా. బలమైన భావోద్వేగాలతో పాటు ప్రేమ, కుటుంబ విలువలతో సినిమా ఆద్యంతం హృద్యంగా ఉంటుంది’ అని సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ అన్నారు. గాలి జనార్ధన్‌రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి కథానాయకుడిగా నటించిన చిత్రమిది. రాధాకృష్ణ దర్శకత్వంలో రజనీ కొర్రపాటి నిర్మించారు. ఈ నెల 18న ‘జూనియర్’ విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన సెంథిల్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ‘దర్శకుడు రాధాకృష్ణ చెప్పిన కథ నాకు బాగా నచ్చింది. కొత్త హీరోకు ఇలాంటి సినిమా చేయడం కొంచెం కష్టమే. కానీ కిరీటి ఒక సవాల్‌గా తీసుకొని ఈ సినిమా కోసం కష్టపడిన తీరు నాకు నచ్చింది. ఈ సినిమాలో పాటలతో పాటు కిరీటీ, శ్రీలీల జంట చేసిన డాన్స్‌లను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారు. కిరీటి మంచి నటుడు, అద్భుతమైన డాన్సర్. సెట్స్‌లో చాలా కష్టపడ్డాడు. తొలి చిత్రం ‘జూనియర్’తోనే ఆయన ప్రేక్షకులను ఆకట్టుకుంటాడనే గట్టి నమ్మకం ఉంది. ఒక మంచి సినిమా అందించాలనే తపనతో నిర్మాతలు ఈ సినిమా తీశారు’ అని చెప్పారు.