Pawan Kalyan OG: షర్ట్ లేకుండా ఫైట్? పవన్ కల్యాణ్.. థియేటర్లు మొత్తం తగలబెట్టేసేలా ఉన్నాడుగా!
ABN, Publish Date - May 07 , 2025 | 04:34 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. ‘సాహో’ సుజీత్ దర్శకత్వంలో భారీ యాక్షన్ డ్రామా ఓజీ తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ విషయంలో వస్తోన్న ఓ రూమర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) హీరోగా.. ‘సాహో’ (Sahoo) దర్శకుడు సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో భారీ యాక్షన్ డ్రామా ఓజీ (OG) తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని నిర్మించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ (DVV Entertainment) పతాకంపై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య (DVV Danaiah) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arulmohan) కథానాయిక. బాలీవుడ్ స్టార్ ఇమ్రన్ హస్మి (Emraan Hashmi) ప్రతినాయకుడు. తమన్ (Thaman) సంగీతం అందిస్తున్నాడు.
ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా ‘ఓజీ’(ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) పేరుతో బాగా ప్రాచుర్యం పొందింది. షూటింగ్ ప్రారంభించి ఏడాది పూర్తై తదుపరి అప్డేట్ గురించి ఇప్పటివరకు తెలియకున్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రంపై ఆకాశన్నంటిన అంచనాలు ఉన్నాయి. ఇటీవలే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేయడంతో ఇప్పుడు మరోసారి ఓజీ (OG) సినిమా వార్తల్లోకి వచ్చింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతుందని పవన్ కల్యాణ్ డేట్స్ కూడా అడ్జెస్ట్ చేసినట్లు సమాచారం వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా నుంచి మరో ఆసక్తికరమైన అప్డేట్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
అదేంటంటే ఈ మూవీలో ఓ సందర్భంలో షర్ట్ లేకుండా ఓ భారీ యాక్షన్ సీన్ రూపొందించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ వార్తలో వాస్తవం ఎంత ఉందో గానీ ఫ్యాన్స్ మాత్రం తెగ మురిసి పోతున్నారు. ఆ వార్త నిజం కావాలని కోరుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన కెరీర్ ప్రారంభంలో ఒకటి రెండు చిత్రాల్లో షర్ట్ లేకుండా కనిపించాడు. ఆ తర్వాత మరలా అలాంటి సన్నివేశాలు చేయలేదు. ఇప్పుడు ఓజీ (OG) సినిమా విషయంలో సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్న ఈ రూమర్ నిజమైతే మాత్రం అభిమానులను ఆపడం కష్టంగానే ఉండనుంది. మరి కొద్దిరోజుల్లో ఈ వార్తలపై క్లారిటీ రానుంది.