Nalini Bhikshatanam: భిక్షాటన చేసిన నటి నళిని
ABN , Publish Date - Jul 19 , 2025 | 05:39 AM
సీనియర్ నటి నళిని శుక్రవారం భిక్షాటన చేశారు. చెన్నై తిరువేర్కాడులోని కరుమారి అమ్మవారు కలలో
సీనియర్ నటి నళిని శుక్రవారం భిక్షాటన చేశారు. చెన్నై తిరువేర్కాడులోని కరుమారి అమ్మవారు కలలో కనిపించి కోరడంతో ఈ భిక్షాటన చేసినట్టు ఆమె వెల్లడించారు. తమిళ చిత్రాలు, టీవీ సీరియల్స్‌లో నటిస్తూ బిజీగా ఉన్న నళిని తిరువేర్కాడు కరుమారి అమ్మన్ ఆలయంలో కొంగుపట్టుకుని భక్తుల దగ్గర భిక్షాటన చేశారు. ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ, ‘నన్ను ఆశీర్వదిస్తూ ఎల్లవేళలా రక్షిస్తున్న నా ఇష్టదైవమైన తిరువేర్కాడు కరుమారి అమ్మ కలలో కనిపించి నాకోసం ఏం చేయబోతున్నావని అడిగింది. దీంతో ఏం చేయాలో తోచక... కొంగుపట్టి భక్తుల వద్ద భిక్షాటన చేశాను. తద్వారా వచ్చిన కానుకలను అమ్మవారికి కానుకగా సమర్పించాను’ అని వివరించారు.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్ హైప్ ప్రారంభం.. ఎలా ఉపయోగించాలో తెలుసా..
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి