Year Ender 2025: సీనియర్ స్టార్స్ స్ట్రాంగ్ కమ్ బ్యాక్
ABN , Publish Date - Dec 26 , 2025 | 01:58 PM
ఒకప్పుడు పలు చిత్రాల్లో అలరించి, తరువాత సినిమాలకు దూరంగా జరిగారు కొందరు... మళ్ళీ కెమెరా ముందుకు రారేమో అని ఫిక్స్ అయ్యారు. కానీ బ్లడ్ లోనే యాక్టింగ్ పెట్టుకుని ఎక్కడికి వెళ్తారు.. ఎన్నాళ్లు తప్పించుకుంటారు.. కాలం కలిసొచ్చి.. మళ్లీ బిగ్ స్క్రీన్ పై మెరిశారు....వారెవరో చూద్దాం..
ఒకప్పుడు పలు చిత్రాల్లో అలరించి, తరువాత సినిమాలకు దూరంగా జరిగారు కొందరు... మళ్ళీ కెమెరా ముందుకు రారేమో అని ఫిక్స్ అయ్యారు. కానీ బ్లడ్ లోనే యాక్టింగ్ పెట్టుకుని ఎక్కడికి వెళ్తారు.. ఎన్నాళ్లు తప్పించుకుంటారు.. కాలం కలిసొచ్చి.. మళ్లీ బిగ్ స్క్రీన్ పై మెరిశారు....వారెవరో చూద్దాం...
ఈ యేడాది చాలా మంది సీనియర్ నటీనటులకు గ్రాండ్ కమ్ బ్యాక్ లభించింది. సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి తిరిగి వచ్చి, తమదైన నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు కొందరు. 1980లలో హీరోగా నటించిన నందమూరి కళ్యాణ్ చక్రవర్తి (Kalyan Chakravarthy) 35 ఏళ్ల తర్వాత రోషన్ హీరోగా నటించిన 'ఛాంపియన్'లో కీలక పాత్రతో రీ-ఎంట్రీ ఇచ్చాడు. సినిమాకే హైలైట్ గా నిలిచే రాజి రెడ్డి క్యారెక్టర్ లో కనిపించాడు. కళ్యాణ్ చక్రవర్తి పవర్ ఫుల్ క్యారెక్టర్ చూసి అభిమానులు ఖుషి అవుతున్నారు.
ఓ నాటి అందాల తార మంజుల చిన్నకూతురు శ్రీదేవి విజయ్‌కుమార్ (Sridevi Vijay kumar) లాంగ్ గ్యాప్ తర్వాత నారా రోహిత్ 'సుందరకాండ' చిత్రంతో రీ-ఎంట్రీ ఇచ్చారు. ప్రభాస్ తొలి చిత్రం 'ఈశ్వర్'లో నాయికగా నటించిన శ్రీదేవి తరువాత కొన్ని సినిమాల్లో హీరోయిన్ గానే అలరించింది... తరువాత సినిమాలకు దూరంగా జరిగిన శ్రీదేవి రొమాంటిక్ కామెడీ డ్రామా 'సుందరకాండ'లో మధ్యవయస్కురాలు వైష్ణవి పాత్రలో కనిపించారు. 2011లో వచ్చిన ' వీర' లో మెరిసిన శ్రీదేవి ఇన్నేళ్ళ తర్వాత మళ్ళీ తెరపై కనిపించారు.
ఇక 'స్వయంవరం', 'ప్రేమించు', 'మిస్సమ్మ' వంటి హిట్స్ ఇచ్చిన లయ సుదీర్ఘ విరామం తర్వాత నితిన్ హీరోగా నటించిన 'తమ్ముడు'తో రీ-ఎంట్రీ ఇచ్చారు. ఈ సర్వైవల్ యాక్షన్ డ్రామాలో ఆమె నితిన్ సోదరి పాత్రలో కీలకంగా కనిపించారు. ఈ చిత్రం సిబ్లింగ్ బాండ్‌ను ఎమోషనల్‌గా చూపించారు. లయ చివరగా 'బ్రహ్మ లోకం టూ యమలోకం వయా భూలోకం' చిత్రంలో ఆదిపరాశక్తి పాత్రలో కనిపించి ఆ తర్వాత సినిమాలకు దూరమైంది. మధ్యలో 'అమర్ అక్బర్ ఆంటోని' కాసేపు కనిపించింది లయ... దాదాపు 14 ఏళ్ల తర్వాత మళ్లీ వెండితెరపై కనిపించారు.
ఒకప్పుడు కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన జెనీలియా 13 ఏళ్ల గ్యాప్ తర్వాత 'జూనియర్' చిత్రంతో తెలుగులో రీ-ఎంట్రీ ఇచ్చారు. 2012 లో వచ్చిన 'నా ఇష్టం' తర్వాత తెలుగు తెరకు దూరమైంది. బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నప్పటికీ ఈ ఏడాది 'జూనియర్' తో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చింది జెనీలియా.... కిరీటి రెడ్డి, శ్రీలీలతో కలసి నటించిన 'జూనియర్'లో ఆమె కీలక పాత్రలో కనిపించారు. రాధాకృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఆకట్టుకుంది.
మరోవైపు 'మన్మథుడు' ఓ హీరోయిన్ గా కనిపించిన అన్షు, ఆ పై ప్రభాస్ 'రాఘవేంద్ర'లోనూ కీ రోల్ పోషించింది... దాదాపు 22 ఏళ్ల తర్వాత 'మజాకా'తో రీ-ఎంట్రీ ఇచ్చారు. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ రొమాంటిక్ కామెడీలో రీతూ వర్మతో కలసి లీడ్ రోల్ పోషించారు అన్షు... త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చింది... ఇందులో మిడిల్ ఏజ్డ్ బ్యూటీగా అన్షు తళుక్కుమంది...
యంగ్ హీరో సుహాస్ హీరోగా నటించిన 'ఓ భామ అయ్యో రామ'లో 'నువ్వు నేను' ఫేమ్ అనితా దాదాపు 20 ఏళ్ళ తరువాత రీ-ఎంట్రీ ఇచ్చారు. 12 ఏళ్ల తర్వాత కామ్నా జెఠ్మలానీ కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'కె-ర్యాంప్'తో వెండితెరపై కనిపించారు. సినిమాల గుడ్ బై చెప్పి పాలిటిక్స్‌లోకి వెళ్లిన విజయశాంతి చాలా ఏళ్ళ తరువాత 2020 లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' లో పవర్ ఫుల్ లో రోల్ కనిపించారు. దాదాపు ఐదేళ్ల పాటు సిల్వర్ స్క్రీన్ కు దూరమైన ఈ లేడీ సూపర్ స్టార్ 'అర్జున్ సన్నాఫ్ వైజయంతి' లో నటించారు. 'ఆది' హీరోయిన్ కీర్తి చావ్లా- విశ్వక్సేన్ 'లైలా'లో కనిపించారు. 'ఆంధ్ర కింగ్ తాలూకా'లో సింధు తులానీ చాలా ఏళ్ళకు తళుక్కుమన్నారు...
ఇక బ్రహ్మానందం కొడుకు రాజా గౌతమ్ 2022 లో వచ్చిన 'బ్రేక్ అవుట్' తర్వాత 'బ్రహ్మ ఆనందం' మూవీలో నటించాడు. కమెడియన్ ధనరాజ్ 2019లో వచ్చిన 'కథనం' తర్వాత 'రామం రాఘవం'లో కనిపించారు. 'రోజా' ఫేమ్ మధుబాల 'నాన్నకు ప్రేమతో' తర్వాత 'కన్నప్ప' చిత్రంలో పన్నగ అనే తెగ నాయకురాలిగా కనిపించారు. 2011 లో వచ్చిన 'పిల్ల జమీందార్' తర్వాత బింధు మాధవి 'దండోరా'లో నటించింది. ఇలా తెరమరుగయ్యారనుకున్న నటీనటులు మళ్ళీ కెమెరా ముందుకు వచ్చారు... వారికి 2025 ఓ మరపురాని సంవత్సరమే అని చెప్పొచ్చు... రాబోయే 2026లో ఇంకెందరు తెరమరుగైన వారు వెలుగులు చూస్తారో చూడాలి...