Sayara: ప్రేమ గొప్పదనాన్ని చాటేలా
ABN , Publish Date - Jun 11 , 2025 | 05:34 AM
యశ్‌రాజ్ ఫిల్మ్స్ బేనర్‌పై మోహిత్ సూరి తెరకెక్కిస్తోన్న కొత్త తరం ప్రేమ కథ ‘సయరా’. జూలై 18న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రం...
యశ్‌రాజ్ ఫిల్మ్స్ బేనర్‌పై మోహిత్ సూరి తెరకెక్కిస్తోన్న కొత్త తరం ప్రేమ కథ ‘సయరా’. జూలై 18న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రం ద్వారా ఆహాన్ పాండే హీరోగా పరిచయం అవుతున్నారు. అనీత్ పద్దా కథానాయిక.
తాజాగా ఈ చిత్రం నుంచి ‘బర్బాద్’ అంటూ సాగే రెండో పాటను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటకు దిరిష్ సాహిత్యాన్ని అందించడంతోపాటు బాణీని సమకూర్చగా, జుబిన్ ఆలపించారు.
ఈ సందర్భంగా దర్శకుడు మోహిత్ మాట్లాడుతూ ‘రొమాంటిక్ పాటలకు లోతైన భావం ఉంటుంది. అలాంటి పాటలకు గతంలోకి తీసుకెళ్లే శక్తి ఉంటుంది. ఈ పాట ప్రేమ, ప్రేమికుల గొప్పదనాన్ని చాటేలా ఉంటుంది’ అని అన్నారు.