Premisthunna: సాత్విక్ వర్మ, ప్రీతి నేహా హీరో హీరోయిన్లుగా ‘ప్రేమిస్తున్నా’
ABN , Publish Date - May 11 , 2025 | 03:58 PM
వరలక్ష్మీ పప్పుల సమర్పణలో కనకదుర్గారావు పప్పుల నిర్మాతగా భాను దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో రాబోతున్న సినిమాకు ‘ప్రేమిస్తున్నా’ టైటిల్ ను ఖరారు చేశారు.
వరలక్ష్మీ పప్పుల (Varalakshmi Pappula) సమర్పణలో కనకదుర్గారావు పప్పుల (Kanakadurga Rao Pappula) నిర్మాతగా భాను (Bhanu) దర్శకత్వంలో సరికొత్త ప్రేమకథతో రాబోతున్న సినిమాకు ప్రేమిస్తున్నా (Premisthunna) టైటిల్ ను ఖరారు చేశారు. సాత్విక్ వర్మ (Satvik Varma), ప్రీతి నేహా (Preeti Neha) హీరో హీరోయిన్లు గా నటించారు. అన్ని ప్రేమకథల్లోనూ ప్రేమ ఉంటుంది, కానీ ఈ ప్రేమకథలో ఆకాశమంత ప్రేమ అనంతమైన ప్రేమ ఉంటుంది, లవ్ లో ఇదివరకు ఎవ్వరూ టచ్ చెయ్యని ఒక డిఫరెంట్ పాయింట్ తో ప్రేమిస్తున్నా సినిమాను తెరకెక్కించారు. అంతేగాక యంగ్ జనరేషన్ మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే అనేక ఎలిమెంట్స్ ఈ సినిమాలో పొందు పరిచారు.
సాలూరి రాజేశ్వర రావు గారి కుటుంబం నుంచి వస్తోన్న సిద్ధార్థ్ సాలూరి ఈ సినిమాకు అద్భుతమైన సంగీతం అందించాడు. భాస్కర్ శ్యామల సినిమాటోగ్రఫీ అందించారు, అనిల్ కుమార్ అచ్చు గట్ల ఈ సినిమాకు సంభాషణలు వ్రాశారు. చిత్రంలో ఇద్దరు ప్రముఖ నటులు ముఖ్య పాత్రల్లో నటించారు, వారి వివరాలు త్వరలో తెలియనున్నాయి. సంగీతమే ప్రధానంగా సాగే ఈ ప్రేమకథలో సాత్విక వర్మ, ప్రీతి నేహా ఇద్దరూ పోటీపడి నటించారు, వీరిమధ్య వచ్చే సన్నివేశాలు చాలా ఆసక్తికరంగా, నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే సస్పెన్స్ తో దర్శకుడు భాను రూపొందించారు.