Mana Shankara Varaprasad Garu: బాస్‌.. శ‌శిరేఖ లిరిక‌ల్ వీడియో సాంగ్‌ వచ్చేసింది! కానీ ఏదో మిస్స‌యింది

ABN , Publish Date - Dec 07 , 2025 | 12:05 PM

మెగాస్టార్ చిరంజీవి మ‌న శంక‌ర్ వ‌ర‌ప్రాద్ గారు పండ‌క్కి వ‌స్తున్నారు చిత్రం నుంచి శ‌శిరేఖ లిరిక‌ల్ వీడియో సాంగ్ విడుద‌లైంది.

Mana Shankara Varaprasad Garu

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), అనీల్ రావిపూడి (Anil Ravipudi) కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుత‌న్న చిత్రం మ‌న శంక‌ర్ వ‌ర‌ప్రాద్ గారు పండ‌క్కి వ‌స్తున్నారు (Mana Shankaravaraprasad Garu Pandagaki Vasthunnaru). ఇప్ప‌టికే శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం రానున్న సంక్రాంతికి థియేట‌ర్ల‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌ల చేసిన మీసాల పిల్ల అనే పాట అంచ‌నాల‌ను మించి విజ‌యం సాధించి సినిమా హైప్స్ మ‌రింత‌గా పెంచింది. ఈ నేప‌థ్యంలో తాజాగా శ‌శిరేఖ (Sasirekha) అంటూ సాగే మ‌రో ల‌వ్ మెలోడీ పాట‌ను విడుద‌ల చేశారు.

బీమ్స్ సిసిరిలియో (Bheems Ceciroleo) సంగీత ద‌ర్శ‌క‌త్వంలో అనంత శ్రీరామ్ ( Anantha Sriram) ఈ పాట‌కు సాహిత్యం అందించ‌గా బీమ్స్‌, మ‌ధు ప్రియ (Madhupriya) ఆల‌పించారు. శ‌శిరేఖా ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీల్ కాక.. ఓ ప్ర‌సాదు మెహామాటాలు లేకుండా చెప్పేసేయ్ ఏమీ కాదు అంటూ సాగిన ఈ పాటను చిరంజీవి, న‌య‌న‌తార‌ల‌పై చిత్రీక‌రించారు. భాను మాస్ట‌ర్ (Bhanu Master) నృత్య‌రీతులు స‌మ‌కూర్చారు.

అయితే.. ఈ పాట‌వింటుంటే స‌మ్‌థింగ్ ఏదో ఓ మిస్స‌యిన ఫీల్ వ‌స్తండ‌గా చిరంజీవికి భీమ్స్ వాయిస్ మ్యాచ్ అయిన‌ట్లు కూడా అనిపించ‌లేదు. అలాగే తెలుగు పాట వింటున్న‌ట్లు కాక ఇత‌ర కొత్త భాష పాటేదో వింటున్న ఫీల్ వస్తుంద‌ని ప‌లువురు ఫ్యాన్స్ పెద‌వి విరుస్తున్నారు. మొత్తంగా పాట చూస్తూ.. వింటుంటే గ‌త మీసాల పిల్ల ద‌రిదాపుల్లోకి వ‌చ్చేలా అయితే క‌నిపించ‌డం లేదు. ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందే అవ‌కాశం క‌నిపిస్తోంది.

Updated Date - Dec 07 , 2025 | 12:09 PM