Saroja Devi: ఏయన్నార్‌తో.. బి.సరోజాదేవి

ABN , Publish Date - Jul 14 , 2025 | 02:15 PM

నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు సరసన బి.సరోజాదేవి నటించి అలరించారు.Saroja devi movies with Akkineni nageswararao

Saroja devi

నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (akkineni Nageswararo) సరసన బి.సరోజాదేవి (B Saroja devi) నటించి అలరించారు. అయితే వీరిద్దరూ తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకున్న చిత్రం 1958లో రూపొందిన 'భూ కైలాస్'. ఇందులో నారద పాత్రలో ఏయన్నార్ నటించగా, పార్వతీదేవిగా సరోజాదేవి అభినయించారు. తరువాత ఏయన్నార్, అంజలీదేవి జంటగా రూపొందిన 'పెళ్ళిసందడి'లో సరోజాదేవి కీలక పాత్ర ధరించారు. వారిద్దరూ జంటగా నటించిన తొలి సినిమా 'పెళ్ళికానుక' (Pelli kanuka 1960). ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ఆ పై 'శ్రీకృష్ణార్జున యుద్ధం'లో ఏయన్నార్ అర్జునునిగా, సరోజాదేవి సుభద్రగా అభినయించారు. కేవీ రెడ్డి తెరకెక్కించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఏయన్నార్, సరోజాదేవి నటించిన 'ఆత్మబలం' (1964) సినిమా మ్యూజికల్ హిట్ గా నిలచింది. ఆ పై ఏయన్నార్ తో సరోజాదేవి నటించిన చారిత్రక నేపథ్య చిత్రం 'అమరశిల్పి జక్కన్న' (1964), జానపద సినిమా 'రహస్యం' (1967) చిత్రాలు రంగుల్లో రూపొంది, మంచి పాటలతో తెరకెక్కినా అంతగా అలరించలేక పోయాయి.

Updated Date - Jul 14 , 2025 | 02:24 PM