scorecardresearch

Sankranthiki Vasthunam: భీమవరంలో బాక్సాఫీస్‌ సంబరం

ABN , Publish Date - Jan 27 , 2025 | 08:04 AM

"సంక్రాంతికి వస్తున్నాం’ పండుగకు వచ్చాం, కొట్టాం. ఇదంతా మీ సక్సెసే. భీమవరం ప్రేక్షకులు ఎప్పుడూ నా గుండెల్లో వుంటారు. - Venkatesh

Sankranthiki Vasthunam: భీమవరంలో బాక్సాఫీస్‌ సంబరం


"సినిమా చేస్తున్నప్పుడే పెద్ద ఎంటర్‌టైనర్‌ అవుతుందని అనుకున్నాం.. దాదాపు 300 కోట్ల వరకూ తీసుకెళ్తుందని ఊహించలేదు. ఇదంత ప్రేక్షకుల సక్సెస్‌. మీ ప్రేమ ఇలానే వుంటే మళ్ళీ సంక్రాంతి వస్తాం. మరో బ్లాక్‌ బస్టర్‌ ఇస్తాం.  హిట్‌ చేసిన అందరు హీరోల అభిమానులకు థ్యాంక్స్‌’’ అని వెంకటేశ్‌ (Venkatesh) అన్నారు. ఆయన హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వం (Anil Ravipudi)వహింవచిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam) సంక్రాంతి బరిలో విడుదలై సూపర్‌ సక్సెస్‌ అయిన సంగతి తెలిసిందే. ఐశ్వర్యా రాజేశ్‌, మీనాక్షి చౌదరి నటీనటులుగా దిల్‌ రాజు సమర్పణలో శిరీష్‌  నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ సంబరం ఈవెంట్‌ను భీమవరంలో గ్రాండ్‌గా నిర్వహించారు.  డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు, ఎమ్మల్యే కామినేని శ్రీనివాసరావు ఈ వేడుకకు అతిథులుగా పాల్గొన్నారు. (Sankranthiki Vasthunam boxoffice sambaram)

వెంకటేష్‌ మాట్లాడుతూ "సంక్రాంతికి వస్తున్నాం’ పండుగకు వచ్చాం, కొట్టాం. ఇదంతా మీ సక్సెసే. భీమవరం ప్రేక్షకులు ఎప్పుడూ నా గుండెల్లో వుంటారు. ఇది మంచి హిట్‌ సినిమా చేస్తున్నాం అనుకున్నాం. కానీ దీన్ని మీరు ట్రిపుల్‌ బ్లాక్‌ బస్టర్‌ చేసినందుకు థాంక్‌ యూ. వంద, రెండు వందలు, మూడు వందలు కోట్లు అంటున్నారు. ఇదంతా మీరు ఇచ్చిందే. క్రెడిట్‌ అంతా మీకు దక్కుతుంది. ఇలాంటి ఎంటర్టైన్మెంట్‌ మళ్ళీ రాదు. సినిమాను హిట్‌ చేసిన అందరు హీరోల అభిమానులకు థ్యాంక్స్‌. మీ ప్రేమ ఇలానే వుంటే మళ్ళీ సంక్రాంతి వస్తాం. మరో బ్లాక్‌ బస్టర్‌ ఇస్తాం’’ అని అన్నారు.

Dil.jpg
డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ "బీమ్స్‌ గోదారి గట్టు పాటతో ఈ సినిమా సందడి మొదలైయింది. ఈ సినిమా పెద్ద హిట్‌ అయితే చాలు అనుకున్నాం. కానీ సినిమాని మీరు ఎక్కడికో తీసుకెళ్ళి పెట్టారు. ఇంత పెద్ద విజయాన్ని ఇచ్చిన ఆడియన్స్‌కి కృతజ్ఞతలు. ఎస్విసి బ్యానర్‌ నా ఫ్యామిలీ. ఇది వారితో ఆరో సినిమా. మా విక్టరీ వెంకటేష్‌ గారికి చాలా థాంక్స్‌. ఈ సినిమా క్రెడిట్‌ ఆయనే దక్కుతుంది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాం. నేను వెంకటేష్‌ గారి అభిమానిని. ఆయన సినిమాకు చూసి విజల్స్‌ వేశాను. ఆయనలా జుట్టు పెంచుకున్నాను. ఆయన సినిమాకి డైరెక్టర్‌ చేయడం గ్రేట్‌ హానర్‌. పద్మభూషణ్‌ అవార్డ్‌ అందుకొనున్న బాలయ్య గారికి మా సినిమా తరపున అభినందనలు. 'ఈ సంక్రాంతిని మర్చిపోలేను. మీ ఆశీస్సులతో కుదిరితే ఇంకో సంక్రాంతి వస్తాం’ అన్నారు సంక్రాంతి పండుగకు ఇలాంటి పెద్ద గిఫ్ట్‌ అసలు ఊహించలేదని మీనాక్షి చౌదరి అన్నారు.  
'సినిమా షూట్‌ పూర్తయ్యాక వెంకటేష్‌ గారిని చాలా మిస్‌ అయ్యాను. ముఖ్యంగా ఫుడ్‌(నవ్వుతూ). ఈ విజయాన్ని మర్చిపోలేను’ అని ఐశ్వర్యా రాజేశ్‌ అన్నారు.

   

Updated Date - Jan 27 , 2025 | 08:04 AM