Raja Saab Unveiled: సంజూ బాబా లుక్కొచ్చింది

ABN , Publish Date - Jul 30 , 2025 | 03:45 AM

ప్రభాస్‌ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న హారర్‌ థ్రిల్లర్‌ ‘రాజాసాబ్‌’. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ఓ కీలక పాత్రలో...

ప్రభాస్‌ హీరోగా మారుతి తెరకెక్కిస్తున్న హారర్‌ థ్రిల్లర్‌ ‘రాజాసాబ్‌’. ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. మంగళవారం ఆయన పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రంలో ఆయన పోషిస్తున్న లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ‘విలక్షణతకు, ఎనర్జీకి పర్యాయపదమైన సంజూ బాబాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అని పేర్కొంది. టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఇటీవలె విడుదలైన టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచేసింది. డిసెంబర్‌ 5న చిత్రం విడుదలవుతోంది.

Updated Date - Jul 30 , 2025 | 03:45 AM