Gamblers Teaser: సంగీత్ శోభన్.. గ్యాంబ్లర్ టీజర్
ABN , Publish Date - May 26 , 2025 | 12:49 PM
సంగీత్ శోభన్ కథానాయకుడిగా తెరకెక్కిన ‘గ్యాంబ్లర్స్’ చిత్రం టీజర్ సోమవారం విడుదల చేశారు.
సంగీత్ శోభన్ (Sangeet Shoban) కథానాయకుడిగా ప్రశాంతి (Prashanthi Charuolingah), ఫృథ్వీరాజ్ బన్నా, సాయి శ్వేత ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘గ్యాంబ్లర్స్’ (Gamblers). థ్రిల్లర్ జానర్‌లో వస్తున్న ఈ చిత్రానికి కేఎస్‌కే చైతన్య (KSK Chaitanya) దర్శకత్వం వహించగా సునీతా రాజ్ కుమార్ బృందావన్ నిర్మించారు. ఈ చిత్రం జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ఓ ఐలాండ్‌లో కేవలం మంది మధ్య క్యాసినో, పేకాట నేపథ్యంలో నడిచే థ్రిల్లర్‌గా ఈ సినిమాను రూపొందించారు.