The Black Gold: యాక్షన్ మోడ్‌లో సంయుక్త.. 'నల్ల బంగారం' చింపేసిందిగా
ABN , Publish Date - Oct 20 , 2025 | 10:44 AM
మలయాళి ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ (Samyuktha) విరూపాక్ష సినిమాతో టాలీవుడ్‌లో సెటిల్ అయిన విషయం తెలిసిందే.
మలయాళి ముద్దుగుమ్మ సంయుక్త మీనన్ (Samyuktha) విరూపాక్ష సినిమాతో టాలీవుడ్‌లో సెటిల్ అయిన విషయం తెలిసిందే. ఆమె హీరోయున్‌గా ఇప్పటికే తెలుగులో నాలుగైదు చిత్రాల్లో నటిస్తుండగా బాలీవుడ్‌లోనూ ఓ తెలుగు డైరెక్టర్ సినిమాలో నటిస్తోంది. అయితే ఇప్పటివరకు హీరోయిన్‌గా ఆడి పాడిన ఈ ముద్దగుమ్మ తన పంథా మార్చింది.ఈ సారి తనే లీడ్ రోల్‌లో ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఇంటెన్స్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది.
తాజాగా దీపావళి పండుగను పురస్కరించుకని ఆదివారం రాత్రే బ్లాక్ గోల్డ్ (The Black Gold) అంటూ ఈ చిత్రం టైటిల్ రివీల్ చేసిన మేకర్స్ తాజాగా మంగళవారం ఈ సినిమా నుంచి సంయుక్త ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ లుక్‌లో కొత్త మాస్ అవతార్‌లో సంయుక్త లుక్ అదిరిపోయేలా ఉంది. రైల్వే స్టేషన్‌లో రక్తం మడుగులో దుండగులంతా పడి ఉండగా చేతిలో గన్‌తో స్టన్నింగ్ గా ఉంది. దాదాపు 16 ఏండ్ల క్రితం చితంకాయల రవి సినిమాను డైరెక్ట్ చేసిన యోగి (YOGESH KMC) మరలా ఇన్నాళ్లకు ఈ సినిమాకు దర్వకత్వం వహిస్తుండడం విశేషం.
ఈ సందర్భంగా సంయుక్త తన ట్విట్టర్‌లో ఈ సినిమా పోస్టర్‌ను పోస్టు చేస్తూ.. నా హృదయానికి చాలా దగ్గరైన ఈ సినిమా..యాక్షన్, ఎమోషన్, ఇంటెన్సిటీ, హృదయాన్ని తాకే క్షణాలతో నిండిన ఒక అద్భుతమైన ప్రయాణాన్ని మీకు చూపిస్తుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ది బ్లాక్ గోల్డ్ (The Black Gold) ప్రపంచం నుంచి ఇంకా ఎన్నో విశేషాలు త్వరలోనే మీను ఆకట్టుకోబోతున్నాయి అంటూ తెలిపింది. ప్రస్తుతం సంయుక్త లుక్ సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది.