Samantha: గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువ సక్సెస్ సాధించా..
ABN , Publish Date - Jun 14 , 2025 | 05:36 PM
తాజాగా సమంత ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. విజయానికి కొత్త నిర్వచనం చెప్పారామె. సినిమాలకు విరామం తీసుకున్న తర్వాత విజయానికి నిర్వచనం మారిందని అర్థమైందన్నారు.

సమంత (Samantha) సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమె భావాలను తరచూ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఇటీవల ఆమె నిర్మాతగా వ్యవహరించిన 'శుభం' (Subham) సినిమాలో కామియో చేసి ప్రేక్షకుల ముందుకొచ్చారు. ప్రస్తుతం తన సొంత బ్యానర్‌లో హీరోయిన్ మా ఇంటి బంగారం చిత్రం చేయనుంది. తాజాగా ఆమె ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు. విజయానికి కొత్త నిర్వచనం చెప్పారామె. సినిమాలకు విరామం తీసుకున్న తర్వాత విజయానికి నిర్వచనం మారిందని అర్థమైందన్నారు. ‘‘విజయానికి నిర్వచనం ఏంటంటే.. స్వేచ్ఛ అని చెబుతాను. అభివృద్థి చెందడం, పరిణితి సాధించడం, బందీగా ఉండకపోవడమే నా దృష్టిలో స్వేచ్ఛ. అదే విజయం. రెండేళ్లుగా నా సినిమా విడుదల కాలేదు. ఈ విరామం సమయంలో నేను ేస్వచ్ఛగా ఉన్నాను. నా చుట్టూ ఉన్న వాళ్లు గతంతో పోలిస్తే నేనిప్పుడు విజయం సాధించానని భావించడం లేదు. కానీ నా దృష్టిలో నేను గతం కంటే ఎక్కువ సక్సెస్‌ఫుల్‌గా ఉన్నాను. నేను చేస్తోన్న ఎన్నో పనులు నాకు ఉత్సాహానిస్తున్నాయి. వాటిని పూర్తిచేయడం కోసం ప్రతిరోజు ఎంతో ఆనందంగా నిద్ర లేస్తున్నాను’’ అని సమంత అన్నారు.