Samantha: అబ్బో.. సామ్ లో కొత్త మార్పు.. గమనించారా

ABN , Publish Date - Aug 01 , 2025 | 10:15 PM

సూపర్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం సినిమాల మీదకన్నా రిలేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుందని టాక్ నడుస్తోంది.

Samantha

Samantha: సూపర్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రస్తుతం సినిమాల మీదకన్నా రిలేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుందని టాక్ నడుస్తోంది. అక్కినేని నాగ చైతన్యతో విడాకులు అయ్యాకా కొన్నేళ్లు ఆరోగ్యాన్ని చూసుకున్న సామ్.. ఈమధ్యనే పనిలో పడింది. అంతకుముందులా వరుస సినిమాలు ఒప్పుకోకుండా ఆచితూచి అడుగులు వేస్తుంది. ఒకపక్క హెల్త్ ను కాపాడుకుంటూ ఇంకోపక్క పనిలో బిజీగా మారింది. ఎప్పుడెప్పుడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకు సామ్ ఎప్పుడు నిరాశనే అందిస్తుంది.


ఇక ఈ సినిమాల మధ్యలో డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో రిలేషన్ మరింత బహిర్గతం అయ్యింది. ఎక్కడకు వెళ్లినా ఈ జంటనే కెమెరా కంటికి తగులుతున్నారు. ఇక వీరిద్దరూ ఇప్పటికే ఎంగేజ్ మెంట్ ను కూడా జరుపుకున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి అందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. సామ్ కు అటెన్షన్ తెచ్చుకోవడం పెద్ద విషయం కాదు. ఒక్కసారి ఫోకస్డ్ గా కెమెరా ముందు నిలబడితే చాలు.. సోషల్ మీడియా అంతా అమ్మడే ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంది. అయితే ఒకప్పుడు సామ్ పై ట్రోలింగ్ ఏ రేంజ్ లో ఉండేదో అందరికీ తెల్సిందే.


మయోసైటిస్ బారిన పడిన సామ్.. పూర్తిగా పాడైపోయింది. ముఖం మొత్తం పాలిపోయి, బక్కచిక్కి, స్టెరాయిడ్స్ వాడుతూ అసలు సమంతనేనా అనేంతలా మారిపోయింది. ఇక ఇప్పుడిప్పుడే ఈ చిన్నది తిరిగి కోలుకుంటుంది. ముఖం ఒకప్పటిలా వస్తుంది. దానికి కారణం రాజ్ తో పెళ్లి అనే అంటున్నారు. ప్రస్తుతం సామ్ ఎంతో హ్యాపీ గా ఉందని, దాని వలనే ఆమె అందం మరింత పెరిగిందని, ముఖంలో కళ, కొంచెం బరువు కూడా పెరిగి వింటేజ్ సామ్ లా మారుతుందని చెప్పుకొస్తున్నారు.


తాజాగా సమంత బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ లో సోషల్ మీడియాను సెగలు పుట్టించింది. అంతేనా తడి హెయిర్ తో గాగుల్స్ పెట్టుకొని ఈ చిన్నది నడుచుకుంటూ వస్తుంటే కుర్రాళ్ళ గుండెలు గుభేల్ మనడం ఖాయమని చెప్పుకొస్తున్నారు. ఇక ఈ లేడీ బాస్ లుక్ లో సామ్ వింటేజ్ సామ్ ను గుర్తుచేస్తుందని, సామ్ ముఖంలో మార్పులు కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ మార్పు అమ్మడి ముఖంలో ఎన్నిరోజులు కనిపిస్తుందో చూడాలి.

Updated Date - Aug 01 , 2025 | 10:15 PM