Samantha: సమంత.. మరోసారి టాప్ లేపిందిగా! మరి ఈ రేంజ్‌లోనా
ABN , Publish Date - Nov 04 , 2025 | 10:56 PM
ముంబయ్‌లో జరిగిన ప్రత్యేక ఈవెంట్‌లో సమంత కొత్త లుక్‌లో దర్శణమిచ్చి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
ఏడాదిన్నరుగా కొత్త సినిమాలు చేయని సమంత రూత్ ప్రభు (Samantha Ruth Prabhu) ఇటీవల తన సొంత బ్యానర్‌లో ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం విశ్రాంతి తీసుకున్న సమంత, ఆరోగ్యంపై దృష్టి పెట్టడంతో పాటు సమయం దొరికినప్పుడల్లా ప్రైవేట్ ఈవెంట్లలో పాల్గొంటూ క్రమంగా వ్యాపార రంగంలోకి అడుగులు వేస్తోంది.

ఇప్పటికే ‘పిరిల్ బాల్’ బ్రాండ్‌కు స్పాన్సర్‌గా మారిన సమంత, ఈ ఏడాది తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా ‘శుభం’ అనే సినిమాను నిర్మించి మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు మరో సినిమాను లైన్‌లో పెట్టినట్లు సమాచారం.

ఇదే సమయంలో ఆమె కొత్తగా పెర్ఫ్యూమ్ వ్యాపారంలోకి అడుగుపెట్టిందని తెలుస్తోంది. సొంతంగా ఒక బ్రాండ్‌ను స్థాపించి, తానే దానికి బ్రాండ్ అంబాసడర్‌గా వ్యవహరిస్తూ మంగళవారం ముంబయ్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ బ్రాండ్‌ను ఆవిష్కరించింది.

ఆ సందర్భంగా సమంత తన అల్ట్రా-మోడ్రన్ లుక్‌తో హాజరై అందరినీ ఆకట్టుకుంది. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో ఆమె కనిపించగా, ఈవెంట్‌కు వచ్చిన అతిథులు, మీడియా ప్రతినిధులు ఆశ్చర్యానికి గురయ్యారు.

ఆ డ్రెస్‌లో సమంతను చూసిన నెటిజన్లు “ఏజ్ పెరుగుతున్నా సమంత మరింత గ్లామరస్‌గా మారుతోంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మీరు కూడా ఆ లుక్‌పై ఓ చూపు వేయండి.