డెట్రాయెట్‌లో చెట్టాపట్టాల్‌

ABN , Publish Date - Jul 10 , 2025 | 06:10 AM

హీరోయిన్‌ సమంత, ‘సిటాడెల్‌’ వెబ్‌సిరీస్‌ దర్శకుడు రాజ్‌ నిడిమోరు రిలేషన్‌షి్‌ప స్టేట్‌సపై తరచూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, వీరిద్దరూ డెట్రాయెట్‌లో కలసి తీసుకున్న ఫొటోను...

హీరోయిన్‌ సమంత, ‘సిటాడెల్‌’ వెబ్‌సిరీస్‌ దర్శకుడు రాజ్‌ నిడిమోరు రిలేషన్‌షి్‌ప స్టేట్‌సపై తరచూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, వీరిద్దరూ డెట్రాయెట్‌లో కలసి తీసుకున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు సమంత. ఈ పిక్‌ వారిపై వస్తున్న రూమర్స్‌కు మరింత బలం చేకూర్చేలా ఉంది. ఇదే సమయంలో రాజ్‌ నిడిమోరు సతీమణి శ్యామలీ పెట్టిన ఇన్‌స్టా స్టోరీ ఒకటి షేర్‌ చేశారు. వివిధ మతాలలోని కీలకమైన కొటేషన్స్‌ను ఆ స్టోరీలో పేర్కొన్నారు. మతమేదైనా మన చర్యలతో ఇతరులను బాధించడం తప్పనే చెబుతుందనీ.. అదే మనం జీవితంలో పాటించవలసిన సూత్రమనీ వాటి సారాంశం. సమంత, రాజ్‌ నిడిమోరు కలసి ఉన్న పిక్‌ను చూసి ఆమె బాధపడి ఇలా పోస్ట్‌ చేసి ఉంటారని పలువురు భావిస్తున్నారు.

Updated Date - Jul 10 , 2025 | 06:10 AM