Samantha: హారర్‌ అనిపించొచ్చు కానీ.. అసలు విషయం వేరే

ABN, Publish Date - May 05 , 2025 | 06:58 PM

‘‘నేను నటించిన ‘మజిలీ’, ‘ఓ బేబీ’, ‘రంగసలం’ సినిమా వేడుకలు గుర్తొచ్చాయి. ఇక్కడికి వస్తే సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతోందనిపిస్తోంది - సమంత


అగ్ర కథానాయిక సమంత (Samantha) ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ను ప్రారంభించి తీసిన తొలి చిత్రం ‘శుభం’ (Subham). హర్షిత్‌ రెడ్డి, గవిరెడ్డి శ్రీనివాస్‌, చరణ్‌ పేరి, శ్రియ తదితరులు ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రవీణ్‌ కండ్రేగుల తెరకెక్కించిన చిత్రమిది. సమంత అతిథి పాత్రలో కనిపించనున్న ఈ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. తాజాగా జరిగిన ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఆమె మాట్లాడుతూ ఈ సినిమా చూశాక ప్రేక్షకులు చిరు నవ్వుతోనే బయటకు వస్తారని మాటిచ్చారు.  
 
‘‘నేను నటించిన ‘మజిలీ’, ‘ఓ బేబీ’, ‘రంగసలం’ సినిమా వేడుకలు గుర్తొచ్చాయి. ఇక్కడికి వస్తే సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అవుతోందనిపిస్తోంది. మీరు మళ్లీ ‘శుభం’తో బ్లాక్‌బస్టర్‌ ఇస్తారని ఆశిస్తున్నా. ‘ఏమాయ చేసావె’ చేసిన తర్వాత.. ‘ఈ మూవీ హిట్టా ప్రేక్షకులకు నచ్చిందా? నన్ను నటిగా అంగీకరిస్తారా?’ అని అనుకునేదాన్ని. అప్పట్లో.. ఓ మాల్‌ ఓపెనింగ్‌కు తొలిసారిగా వైజాగ్‌ వచ్చినప్పుడు అభిమానం ఎలా ఉంటుందో అర్థమైంది. నాకు సినిమా అంటే ప్రాణమని మీ అందరికీ తెలుసు.

నిర్మాతగా.. అందరినీ ఆకట్టుకునే ఉద్దేశంతోనే ఈ ప్రొడక్షన్‌ హౌస్‌ పెట్టా. దాని ద్వారా చాలా మందికి అవకాశం కల్పించాలి. ఇదే నా ‘ట్రాలాలా’ నిర్మాణ సంస్థ విజన్‌. ‘శుభం’ చూశాక థియేటర్‌ నుంచి ఓ చిరు నవ్వుతో మీరు బయటకు వస్తారు. దానికి నేను గ్యారెంటీ’’ అని పేర్కొన్నారు.  ‘‘ప్రచార చిత్రాలు చూేస్త మీకు ఇది హారర్‌ కామెడీ అనిపించొచ్చు. కానీ, ఇది వేరే’’ అని సమంత యాంకర్‌ ప్రశ్నకు జవాబిచ్చారు.  ఇంకా ఆమె ఏం చెప్పారంటే.. "అభిమానులు.. మీరు లేనిదే నేను లేను. ఇప్పటికీ ఇలా ఉన్నానంటే దానికి కారణం మీరే'. హార్డ్‌వర్క్‌లాంటివన్నీ అభిమానులిచ్చే ఎనర్జీ తర్వాతే.

Updated Date - May 05 , 2025 | 07:01 PM