Battle of Galwan: ఆగస్టులో ఆరంభం

ABN , Publish Date - Jul 21 , 2025 | 05:11 AM

సల్మాన్‌ ఖాన్‌ కథానాయకుడిగా అపూర్వ లాఖియా ‘బ్యాటిల్‌ ఆఫ్‌ గల్వాన్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. తెలంగాణ వాసి కల్నల్‌ బికుమళ్ల...

సల్మాన్‌ ఖాన్‌ కథానాయకుడిగా అపూర్వ లాఖియా ‘బ్యాటిల్‌ ఆఫ్‌ గల్వాన్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. తెలంగాణ వాసి కల్నల్‌ బికుమళ్ల సంతో్‌షబాబు జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రం రెగ్యులర్‌ షూట్‌ను ఆగస్టు నుంచి ప్రారంభించనున్నారు. ముంబైలో జరిగే ఈ షెడ్యూల్‌తో సల్మాన్‌ ఖాన్‌ సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు. ఇందులో కథానాయకుడి గతానికి సంబంధించిన ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఆ తర్వాత లద్దాఖ్‌లో ఓ కీలక షెడ్యూల్‌ను మొదలుపెట్టనున్నారు మేకర్స్‌. వచ్చే ఏడాది రంజాన్‌ సందర్భంగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ఈ సినిమాలో శక్తిమంతమైన యుద్ధవీరుడిగా కనిపించేందుకు సల్మాన్‌ పూర్తిగా మేకోవర్‌ అయ్యారు. ఇందుకోసం శిక్షణ కూడా తీసుకున్నారు.

Updated Date - Jul 21 , 2025 | 05:11 AM