సన్నబడుతున్న సల్మాన్‌

ABN , Publish Date - Jun 21 , 2025 | 06:50 AM

కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ తన కొత్త సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ‘సికిందర్‌’ చిత్రం అనుకున్నంతగా ఆడకపోవడంతో కొంత నిరాశకు గురైనా, దాని నుంచి తేరుకుని కొత్త సినిమా షూటింగ్‌ కోసం మేకోవర్‌ అవుతున్నారు.

కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ తన కొత్త సినిమా కోసం సిద్ధమవుతున్నారు. ‘సికిందర్‌’ చిత్రం అనుకున్నంతగా ఆడకపోవడంతో కొంత నిరాశకు గురైనా, దాని నుంచి తేరుకుని కొత్త సినిమా షూటింగ్‌ కోసం మేకోవర్‌ అవుతున్నారు. 2020లో గాల్వన్‌ వ్యాలీలో జరిగిన సంఘటన ఆధారంగా రూపుదిద్దుకొనే చిత్రంలో ఆయన నటించనున్నారు. ‘ఇండియాస్‌ మోస్ట్‌ ఫియర్‌లెస్‌ అండ్‌ ఫీచర్స్‌’ నవల ఆధారంగా రూపొందే ఈ సినిమాలో ఆయన ఆర్మీ ఆఫీసర్‌గా నటించనున్నారు. క్యారెక్టర్‌ పరంగా సన్నగా కనిపించడం కోసం తను రెగ్యులర్‌ గా తీసుకొనే డైట్‌ కాకుండా స్ట్రిక్ట్‌ డైట్‌ తీసుకుంటున్నారు.


అలాగే ఎక్కువ సేపు జిమ్‌లో గడుపుతున్నారు. ఆయన బాడీలో కొంత మార్పు కనిపించిన తర్వాత జులైలో లుక్‌ టెస్ట్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు. లుక్‌ ఓ సారి ఓకే అనుకున్న తర్వాత అదే నెలలో షూటింగ్‌ ప్రారంభిస్తారని సమాచారం. తొలి షెడ్యూల్‌ 25 రోజుల పాటు లడఖ్‌లో జరుగుతుందని, ఆ తర్వాత ముంబైలో షూటింగ్‌ కొనసాగుతుందని బీ టౌన్‌ టాక్‌. లడఖ్‌లో భారీ యాక్షన్‌ పార్ట్‌ చిత్రీకరిస్తారని, నవంబర్‌ కల్లా షూటింగ్‌ పూర్తి చేస్తారని అంటున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వం వహించే ఈ చిత్రంలో సల్మాన్‌ కాకుండా మరో మూడు ముఖ్యమైన పాత్రలు ఉంటాయనీ, వాటిని పోషించే నటుల ఎంపిక జరుగుతోందని చెబుతున్నారు.

Updated Date - Jun 21 , 2025 | 09:34 AM