Hari Hara Veera Mallu: విడుదలైన 'సలసల మరిగే' లిరికల్ సాంగ్
ABN , Publish Date - Jul 24 , 2025 | 05:06 PM
పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ ప్లే చేసిన 'హరిహర వీరమల్లు' మూవీ నుండి తాజాగా మరో లిరికల్ సాంగ్ విడుదలైంది. కీరవాణి స్వరాలు సమకూర్చిన ఈ పాటను చైతన్య ప్రసాద్ రాశారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నటించిన తాజా చిత్రం 'హరిహర వీరమల్లు' (Harihara Veeramallu) గురువారం జనం ముందుకొచ్చింది. ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో ఒక రోజు ముందే రాత్రి ప్రీమియర్ షోస్ నూ వేశారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం (A.M. Ratnam) ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన 'హరిహర వీరమల్లు' సినిమాను క్రిష్ తో పాటు జ్యోతికృష్ణ డైరెక్ట్ చేశారు. 17వ శతాబ్దానికి చెందిన కథతో రూపుదిద్దున్న 'హరిహర వీరమల్లు'కు ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి (MM Keeravani) సంగీతం అందించారు. ఈ సినిమా నుండి తాజాగా మరో లిరికల్ వీడియో విడుదలైంది. 'సలసల మరిగే' అంటూ సాగే ఈ అర్థవంతమైన పాటను ప్రముఖ గీత రచయిత చైతన్య ప్రసాద్ రాశారు. దీనిని సాయిచరణ్ భాస్కరుని పాడారు. అతనితో పాటు లోకేశ్వర్ ఈదర, హౌమత్ మహమ్మద్, పీవీఎన్ఎస్ రోహిత్ తదితరులు గానం చేశారు. గురువారం జనం ముందుకు వచ్చిన 'హరిహర వీరమల్లు'కు కీరవాణి అందించిన సంగీతం హైలైట్ గా నిలిచినా... మూవీకి మాత్రం మిశ్రమ స్పందన లభిస్తోంది.