Venkatesh - Sailesh: వెంకీతో మరో సినిమాకు శ్రీకారం..

ABN, Publish Date - May 03 , 2025 | 04:36 PM

హిట్‌ 1, హిట్‌ 2 సినిమాలతో సక్సెస్‌ఫుల్‌ జర్నీ కొనసాగిస్తున్నారు దర్శకుడు శైలేష్‌ కొలను (Sailesh Kolanu). ఇప్పుడు ‘హిట్‌ 3’తో మరో హిట్‌ తన ఖాతాలో వేసుకొన్నాడు.


హిట్‌ 1, హిట్‌ 2 సినిమాలతో సక్సెస్‌ఫుల్‌ జర్నీ కొనసాగిస్తున్నారు దర్శకుడు శైలేష్‌ కొలను (Sailesh Kolanu). ఇప్పుడు ‘హిట్‌ 3’తో మరో హిట్‌ తన ఖాతాలో వేసుకొన్నాడు. అయితే మధ్యలో వెంకటేశ్‌తో (Venkatesh) చేసిన ‘సైంధవ్‌’ (Saindhav) డిజాస్టర్‌ అయింది. వెంకటేష్‌కి 75వ సినిమా ఇది. ఈ సినిమా పరాజయం శైలేష్‌ పరుగులకు బ్రేక్‌ వేసింది. అయితే.. త్వరలోనే వెంకీతో మరో సినిమా చేస్తానని, ఎలాగైనా హిట్‌ కొడతానని నమ్మకంతో చెబుతున్నాడీ దర్శకుడు. ‘శైంధవ్‌’ ఫ్లాప్‌ తర్వాత వెంకటేష్‌ తనకు మానసికంగా అండగా నిలిచారని,  ఇద్దరి మధ్య బాండింగ్‌ పెరిగిందని, మెంటర్‌గా మారారని చెప్పారు.

ప్రతీ విషయంలోనూ వెన్నుదన్నుగా నిలిచారని అలాంటి హీరోకి హిట్‌ ఇవ్వలేకపోయానన్న బాధ బాగా ఉందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు శైలేష్‌. అందుకే వెంకీతో ఓ సినిమా తీసి హిట్‌ కొట్టి పాత లెక్క తీర్చుకుంటానని అంటున్నారు. తాజాగా హిట్‌ -3 సక్సెస్‌గా ఆడుతోంది. దీంతో వెంకటేష్‌ నుంచి ిపిలుపు రావచ్చని ఆశిస్తున్నాడు దర్శకుడు. శైలేష్‌ వరుసగా యాక్షన్‌ థ్రిల్లర్లు, ఇన్వెస్టిగేషన్‌ డ్రామాలే తీస్తున్నాడు. ప్రస్తుతం ఆ జానర్‌కు కాస్త బ్రేక్‌ ఇవ్వాలనుకొంటున్నాడట. ఆయన రొమాంటిక్‌ కామెడీ జోనర్‌లో ఓ కథని సిద్థం చేయాలనుకొంటున్నారట. వినోదాత్మక చిత్రాలంటే వెంకటేశ్‌ గుర్తొస్తారు. అందుకే వెంకీ కోసం కామెడీ టచ్‌ ఉన్న కథని రాసుకొంటే కాంబో సెట్‌ అయినట్లు అవుతుంది.  

Updated Date - May 03 , 2025 | 04:38 PM